కాంగ్రెస్ లో చేరిన చీర్లవంచ ఎంపీటీసీ

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ ఎంపీటీసీ నలువాల రేణుక జలంధర్ రెడ్డి జెడ్పీటీసీ పుర్మాని మంజుల లింగారెడ్డి ఆధ్వర్యంలో సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఎంపీటీసీతో పాటు దాదాపు 40 మంది హస్తం గూటికి చేరినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

 Cheerlavancha Mptc Joined Congress Party, Cheerlavancha, Cheerlavancha Mptc , Mp-TeluguStop.com

కేకే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపిటిసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్య శివప్రసాద్, చిన్నలింగాపూర్ ఎంపీటీసీ బైరినేని రాము, సూర దేవరాజు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube