బిహార్‌: అయ్యో పాపం, కాపాడటానికి వెళ్లిన ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయింది!

బిహార్ రాష్ట్రంలోని ముజఫ్ఫర్‌పూర్ ( Muzaffarpur )జిల్లాలో ఓ విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది.ఇక్కడ వరదలు పోటెత్తడంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటమునగాయి.

 The Army Helicopter That Went To Save Bihar Has Crashed, Helicopter, Muzaffarpu-TeluguStop.com

అలాంటి ఓ గ్రామ ప్రజలకు ఆహార పొట్లాలు అందించాలని సైన్యం హెలికాప్టర్ లో వెళ్ళింది.అది దురదృష్టం కొద్దీ వరద నీళ్లలో పడిపోయింది.

ఈ ప్రమాదం వరద బాధితులకు ఆహార ప్యాకెట్లు వేస్తున్న సమయంలో జరిగింది.ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఓ సైనికుడు చనిపోయాడు.

కానీ, స్థానికంగా కొందరు మిగతా వారిని సురక్షితంగా కాపాడారు.

వరద ప్రాంత బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తోంది.ప్రాణాలకు తెగించి మరీ రెస్క్యూ ఆపరేషన్స్( Rescue operations ) కొనసాగిస్తుంది.ఈ క్రమంలో కొందరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు.

అలాంటి దురదృష్టకరమైన సంఘటనలో ఇటీవల వెళ్తున్న హెలికాప్టర్‌లో ఒక ఇంజన్ పాడైపోయింది.దీంతో పైలట్ చాలా తెలివిగా వ్యవహరించి హెలికాప్టర్‌ను నీళ్లలో దించాడు.

అలా అతి పెద్ద ప్రమాదం తప్పింది.లేకపోతే ఇది ఒక పెద్ద ట్రాజడీగా మారుండేది.

ఎన్‌డీటీవీ ఇండియా ఈ ప్రమాదం గురించి వార్తలు ప్రచురించింది.జిల్లా అధికారులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం( SDRF team ) ప్రమాదం జరిగిన వెంటనే రక్షణ కార్యకలాపాల కోసం వెళ్లింది.

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక సామగ్రిని పడవేసిన తర్వాత హెలికాప్టర్ దర్భంగాకు తిరిగి వస్తోందని ఎస్‌ఎస్‌పి రాకేష్ కుమార్ నివేదించారు.కానీ అంతలోనే హెలికాప్టర్‌ ఔరాయ్‌ బ్లాక్‌లో ఇంజన్‌ ఫెయిల్‌ కావడంతో అత్యవసర ల్యాండింగ్‌ చేస్తుండగా కుప్పకూలింది.ఈ హెలికాప్టర్‌లో భారత వాయుసేన సిబ్బంది ఉన్నారు.

అదృష్టవశాత్తు హెలికాప్టర్‌లో ఉన్న అందరూ సురక్షితంగా బయటపడ్డారు.ఒక్క సైనికుడు మాత్రం ప్రాణాలు కోల్పోయారు.

మిగతా వారిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube