తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లు ఎస్టాబ్లి చేసుకోవడం లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ఆ క్రమంలోనే ఇప్పుడున్న కొంతమంది నటులు సత్తా చాటుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు.
ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో కల్కి సినిమా తో సూపర్ స్టార్ ఇమేజ్ ను అందుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఎప్పుడైతే కల్కి సినిమా ( Kalki movie )వచ్చిందో అప్పటినుంచి ప్రభాస్ తన తదుపరి సినిమాగా చేస్తున్న ఫౌజీ సినిమా( Fauji movie ) మీద కూడా భారీ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో( Ramoji Film City ) జరుగుతుంది.మరి ఇప్పుడు ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత వీళ్ళు జమ్ములో కూడా ఈ సినిమాని షూట్ చేయడానికి పర్మిషన్స్ తీసుకున్నార.మేజర్ సీన్స్ కాకుండా కొన్ని సీన్స్ మాత్రమే జమ్ములో లడక్ లో షూట్ చేయాలని చూస్తున్నారు.మరి మిగతా దంతా సెట్స్ మీదనే నడిపించాలనే ఒక సంకల్పంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక ఏది ఏమైనా ఆయన తనదైన రీతిలో సత్తా చాటుకుంటే మాత్రం ఇండియాలో నెంబర్ వన్ హీరోగా చాలా సంవత్సరాల పాటు కొనసాగుతాడు.

లేకపోతే మాత్రం ఆయన ప్లేస్ ను రీప్లేస్ చేయడానికి కొంతమంది హీరోలు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆయన లైనప్ చాలా పెద్దగా ఉంది.ఇక అందులో భాగంగానే హను రాఘవపూడి తో చేస్తున్న ఫౌజీ సినిమా అయిపోగానే సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్పిరిట్ సినిమాని కూడా చేయబోతున్నాడు.
ఇక ఈ సినిమా తర్వాత సలార్ 2, కల్కి 2 సినిమాలను కూడా లైన్ లో పెడుతున్నాడు…మరి ఈ సినిమాలు రావడానికి ఇంకో 3 నుంచి 4 సంవత్సరాల సమయం పట్టవచ్చు…
.