గత మూడు రోజులుగా సినీ ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీ గొడవలు సంచలనంగా మారాయి.ముఖ్యంగా మంచు మోహన్ బాబు ,విష్ణు ( Mohan Babu, Vishnu )మధ్య ఈ వివాదం చోటు చేసుకోవడంతో ఇది కాస్త తారా స్థాయికి చేరింది.
ఇక వీరిద్దరి మధ్య గొడవలు చోటు చేసుకోవడంతో మనోజ్ గాయాలపాలు కాగా మోహన్ బాబు కూడా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.ఇకపోతే ఈ గొడవ గురించి పూర్తి సమాచారాన్ని ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ కార్యక్రమంలో( press meet program ) సాక్షాలతో సహా వివరిస్తానని మంచు మనోజ్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
మరోవైపు విష్ణు కూడా ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇలా ఇక్కడ ఇలాంటి ప్రెస్ మీట్ పెడతానని ఎప్పుడు కూడా అనుకోలేదు అంటూ మాట్లాడారు.ఇక తాను ఏం చేసినా తన తండ్రి నిర్ణయం ప్రకారమే చేస్తానని విష్ణు చెప్పకనే చెప్పేశారు.ప్రతి ఇంట్లో ఉన్న గొడవలు మాదిరిగానే మా ఇంట్లో కూడా ఈ గొడవలు ఉన్నాయని కానీ తాము సెలబ్రిటీలు కావడంతో దీనిని పెద్దది చేసి చూపిస్తున్నారంటూ మండిపడ్డారు.ఇలా ఈ కుటుంబంలో పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో మంచు లక్ష్మి( Manchu Lakshmi ) ఎక్కడ కూడా ఈ గొడవల గురించి మాట్లాడలేదు.
ఇకపోతే ఈ సమయంలో ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ మాత్రం ప్రస్తుతం సంచలనంగా మారింది.ఈమె ఈ గొడవలతో తనకు ఏమాత్రం సంబంధం లేదు అన్నట్టుగా తన కుమార్తెతో ఒక రీల్ చేయించి ఆ రీల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఫీస్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.దీంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు.ఇంట్లో పెద్ద ఎత్తున గొడవలు జరిగి తల్లితండ్రులు ఇద్దరు హాస్పిటల్ పాలైనప్పటికీ ఈమె మాత్రం ఈ ఘటనల గురించి ఎక్కడ స్పందించకపోవడమే కాకుండా ఇలా రీల్స్ చేయడం ఏంటని కామెంట్స్ చేస్తున్నారు.
అసలు మీ ఫ్యామిలీలో ఏం జరుగుతుందో నువ్వైనా కాస్త క్లారిటీ ఇవ్వు అక్క అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.ఏది ఏమైనా ఇంట్లో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి ఇలాంటి పోస్ట్ చేస్తూ వార్తల్లో నిలిచారు.