టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మంచి సక్సెస్ అందుకున్న మోహన్ బాబు( Mohan Babu ) ఇంట్లో గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇలా ప్రతిక్షణం వీరి గొడవల గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఈ గొడవలు కాస్త సర్దమనగాయని తెలుస్తోంది.
మంచు కుటుంబంలో( Manchu Family ) చోటు చేసుకున్న ఈ గొడవలకు సరైన కారణం తెలియదు కానీ మోహన్ బాబు వర్సెస్ మనోజ్( Manoj ) అనే విధంగా ఈ గొడవలు చోటు చేసుకున్నాయి.ఈ గొడవలలో భాగంగా మోహన్ బాబు బౌన్సర్లు మనోజ్ పై దాడి చేయడం అలాగే మనోజ్ కూడా మోహన్ బాబు ఇంటి పై దాడికి వెళ్లడం వంటివి జరిగాయి.

ఇకపోతే ఈ గొడవలలో భాగంగా మోహన్ బాబు మీడియా వారిపై కూడా దాడి చేసిన సంగతి తెలిసిందే.ఇలా ఈ కుటుంబంలో ఎంతో పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకున్న నేపథ్యంలో ఈ ఫ్యామిలీ గొడవల గురించి ఇండస్ట్రీ మొత్తం చర్చలు జరుపుతున్నారు.ఇలాంటి తరుణంలోనే మంచు లక్ష్మి ప్రసన్న( Manchu Lakshmi Prasanna ) మాత్రం ఈ ఫ్యామిలీలో జరుగుతున్న వివాదాల గురించి ఎక్కడ స్పందించలేదు.దీంతో మంచు లక్ష్మి స్పందించకపోవడానికి కారణమేంటని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదిక చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఈ సందర్భంగా మంచు లక్ష్మి పోస్ట్ చేస్తూ ఈ లోకంలో ఏది నీది కానప్పుడు ఏదో కోల్పోతున్నావనే భయం నీకెందుకు అంటూ ఈమె ఒక కొటేషన్ షేర్ చేశారు దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అసలు మంచు లక్ష్మి ఏ ఉద్దేశంతో ఈ పోస్ట్ చేశారు అనే విషయంపై నెటిజన్స్ ఆరాతీస్తున్నారు.మంచు కుటుంబంలో డబ్బులు ఆస్తి కోసమే గొడవలు చోటు చేసుకున్నాయా అందుకే ఆస్తిపాస్తులు ఏవి శాశ్వతం కాదన్న ఉద్దేశంతోనే లక్ష్మీ మంచు ఇలాంటి పోస్ట్ చేశారా అన్న చర్చలు జరుగుతున్నాయి.