తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు చెబితే ముందుగా మనకు నందమూరి ఫ్యామిలీ గుర్తుకొస్తుంది.నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరకి ప్రతి ఒక్కరు వాళ్ళ సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న గుర్తింపును అంచలంచలుగా పెంచుతూ పోతున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు( Balayya Babu ) లాంటి స్టార్ హీరో సైతం తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ ని కాపాడుకుంటూ వస్తున్నాడు…
మరి ఆయన చేస్తున్న ప్రతి సినిమా ఎలాంటి సక్సెస్ ని సాధిస్తుందనే విషయం పక్కన పెడితే సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ ఫ్యామిలీ భాద్యతలను తన భుజాల మీద మోసుకొని వస్తున్నాడు.ఇక ప్రస్తుతం ఆ పరంపరం ను జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) కూడా కొనసాగిస్తున్నప్పటికి బాలయ్య బాబు మాస్ సినిమాలను చేస్తూ ఎదిగాడు.కాబట్టి ఆయనకి మాస్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్నాడు.ఇక ఆయన ఇప్పుడు కూడా ‘డాకు మహారాజు’( Daku Maharaj ) లాంటి ఒక మాస్ సినిమాను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను పొందడానికి మరోసారి ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
ఇక ఇప్పటివరకు బాలయ్య బాబు చేసిన సినిమాలు ఓకెత్తయితే ‘డాకు మహారాజు’ సినిమా మరొక ఎత్తుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమాలో అతను నటిస్తున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.అయితే ఇందులో ఇద్దరు బాలకృష్ణ లు ఉంటారు.దాంతో ఇందులో ఒక బాలకృష్ణ చనిపోతున్నాడా లేదంటే ఇద్దరు బాలకృష్ణలు బతికే ఉంటారా అనే విషయాల మీద సరైన క్లారిటీ లేదు.
కానీ దర్శకుడు బాబీ( Director Bobby ) మాత్రం ఈ సినిమాను భారీ ఎత్తున తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది…చూడాలి మరి ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ను అందుకుంటారు అనేది…
.