టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ప్రభాస్( Hero Prabhas ) గురించి మనందరికీ తెలిసిందే.ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఒకదాని తర్వాత ఒకటి పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ తనకున్న క్రేజ్ ని మరింత పెంచుకుంటున్నారు డార్లింగ్ ప్రభాస్.సినిమా సినిమాకు ఆయనకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరుగుతూనే ఉంది.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నాయి.అవన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే.
ఏ స్టార్ హీరో లేనంత బిజీగా ఉన్నారు ప్రభాస్.
ఇకపోతే త్వరలో ప్రభాస్ స్పిరిట్ ( Spirit )సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.సందీప్ రెడ్డి వంగా( Sandeep Reddy Vanga ) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్ట్ పై ఇండస్ట్రీలోనే కాదు అభిమానులలో కూడా భారీగా అంచనాలు ఉన్నాయి.తాజాగా ప్రభాస్ పోలీస్ గెటప్ లో ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ పిక్ ను ప్రభాస్ అభిమానులు ఏఐ టెక్నాలజీ ద్వారా క్రియేట్ చేశారు.ప్రభాస్ పోలీస్ యూనిఫార్మ్ లో సిగరెట్ తాగుతూ స్టైలిష్‌గా కనిపిస్తున్న ఆ ఫోటో చూసిన మరికొందరు అభిమానులు స్పిరిట్ లో ప్రభాస్ లుక్ ఇదేనా? అంటూ ఆశగా అడుగుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కొంతమంది అభిమానులు ఈ ఫోటోని సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.మరి ఈ పోస్టర్ పై మూవీ మేకర్స్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.అయితే వంగా దర్శకత్వంలో ప్రభాస్ ఇలా కనిపిస్తే మాత్రం అరాచకమే అనేలా కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం ప్రభాస్ అనేక ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు.
సలార్ 2, ప్రాజెక్ట్ కె, స్పిరిట్ లాంటి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు.