భారతీయ సంస్కృతిలో శతాబ్దాలుగా తమలపాకులు( Betel Leaves ) కొనసాగుతున్నాయి.పెళ్లిల నుండి పండుగల వరకు ప్రతి వేడుకల్లో కూడా తమలపాను ముఖ్యమైనదిగా భావించి ఉపయోగిస్తారు.
అయితే ఇది పెద్దలు మాత్రమే కాకుండా యువత హృదయాల్లో కూడా స్థానం సంపాదించింది.అయితే తమలపాకు ఆకు ఆహ్లాదకరమైన, రుచికరమైన ఆకు మాత్రమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది.
మధుమేహాన్ని( Diabetes ) నియంత్రించడానికి, అలాగే ఒత్తిడిని తగ్గించేడానికి ఇలా ఈ ఆకులో ఎన్నో రకాల సమస్యలను దూరం చేయగల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.

తమలపాకు వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.తమలపాకును యాంటీ ఆక్సిడెంట్ ల( Anti Oxidants ) పవర్ హౌస్ గా భావిస్తారు.ఇది శరీరంలో పీహెచ్ స్థాయిని సాధారణంగా ఉంచుతుంది.
అలాగే కడుపు సంబంధించిన సమస్యలను కూడా దూరం చేస్తుంది.ఇంకా మలబద్ధకం సమస్యలో దీన్ని ఉపయోగం ప్రత్యేకంగా ఉంటుంది.
అంతేకాకుండా ఉదర సమస్యల నుండి కూడా ఇది ఉపశమనం పొందేందుకు సహాయపడుతుంది.తమలపాకులను నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయం నిద్ర లేవగానే ఆ నీటిని వడబోసి కాళీ కడుపుతో తాగితే మలబద్ధకం సమస్య ఎప్పటికీ కూడా ఉండదు.

తమలపాకులో అనేక యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి.ఇవి నోటి దుర్వాసన, దంతాల పసుపు రంగు దంత క్షయం లాంటి సమస్యలను దూరం చేస్తుంది.ఇక ఆహారం తిన్న తర్వాత తమలపాకులతో చేసిన పేస్టుని కొద్ది మొత్తంలో నమలడం వలన నోటి ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.అంతేకాకుండా ఇది పంటి నొప్పి, చిగుళ్ళ నొప్పి, వాపు , నోటి ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది.
దగ్గు, ఉబ్బసం లాంటి శ్వాసకోశ వ్యాధుల చికిత్సలకు కూడా తమలపాకు ఆయుర్వేదంలో ఎంతో ప్రత్యేకతను సాధించింది.తమలపాకు ను నమలడం వలన ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం లభిస్తుంది.