మామూలుగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు సినిమాలను బట్టి అందుకు తగ్గ పాత్రలను బట్టి ఆయా హీరోయిన్ లతో నటిస్తూ ఉంటారు.హీరోలుగా తండ్రీ కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసిన వారు ఉన్నారు.
కాని తల్లీ కూతురు హీరోయిన్లుగా ఒకే హీరోతో జతగా నటించిన అరుదైన రికార్డ్ ఒక్క ఎన్టీరామారావుకే దక్కింది.ఇంతకీ ఆ హీరోయిన్లు ఎవరు? సినిమాలలో నటించారు అన్న విషయానికి వస్తే.ఎన్టీఆర్ తో( NTR ) ఏకంగా మూడు తరాల హీరోయిన్లు నటించారు అన్న విషయం చాలామందికి తెలియదు.అప్పట్లో చాలామంది నటీమణులు ఎన్టీఆర్ సరసన నటించడానికి ఉరుకులు పెట్టేవారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఎన్టీఆర్ కు మనవరాలిగా చేసిన శ్రీదేవి( Sridevi ) కూడా హీరోయిన్ గా నటించింది.

ఇలా హీరోయిన్ల విషయంలో మరో రికార్డ్ కూడా ఆయన సొంతం అయ్యింది.ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో వింతలు విచిత్రాలు జరుగుతుంటాయి.సందర్భానుసారం అవి బయటకు వస్తుంటాయి.
హీరోయిన్ల విషయంలో ఎక్కవగా ఇలాంటివి చూస్తుంటాం.ఒకే హీరోయిన్ తో తండ్రీ కొడుకు ఇద్దరు రొమాన్స్ చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి.
చిరు చరణ్, నాగార్జున, చైతన్య, ఇలా తండ్రి కొడుకులు ఒకే హీరోయిన్ తో ఆడిపాడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి.అయితే విచిత్రంగా తల్లీ కూతురు ఇద్దరి తో వేరు వేరు సినిమాల్లో రొమాన్స్ చేసిన రికార్డ్ మాత్రం టాలీవుడ్ మొత్తం మీద పెద్దాయన ఎన్టీఆర్ కి మాత్రమే దక్కింది.
ఇంతకీ ఆ తల్లీ కూతురు హీరోయిన్లు ఎవరు అన్న విషయానికి వస్తే.వాళ్ళు ఎవరో కాదు.
జయచిత్ర( Jayachitra ) ఆమె తల్లి అమ్మాజి.( Ammaji ) అవును జయచిత్ర అందరికి తెలిసే ఉంటుంది.

హీరోయిన్ గా చాలామందికి తెలియకపోయినా, ఆమె విలన్ గా మాత్రం చాలా సినిమాల్లో కనిపించారు.అబ్బాయి గారు సినిమాలో వెంకటేష్ మారు తల్లిగా విలనిజం పండించిన జయచిత్ర బాలయ్య బాబు సమరసింహారెడ్డిలో కూడా మారు తల్లిగా హోటల్ ఓనర్ గా అలరించారు.ఇక జయచిత్ర తల్లి అమ్మాజి కూడా హీరోయిన్ నే.ఆమెను అప్పట్లో జయశ్రీ అని కూడా పిలిచేవారు.అయితే వీరిద్దరు అన్న నందమూరి తారకరామారావు తో హీరోయిన్లుగా నటించారు.ఒక్క హీరోతో తల్లీ కూతురు నటించడం మాత్రం ఒక్క రామారావుతో మాత్రమే సాధ్యం అయ్యింది.అమ్మాజీ అలియాస్ జయశ్రీ తెలుగులో రోజులు మారాయి,( Rojulu Marayi ) దైవబలం( Daiva Balam ) లాంటి సినిమాలలో నటించారు.అయితే ఈ ఇద్దరితోను సీనియర్ ఎన్టీఆర్ రొమాన్స్ చేసి ఒక అరుదైన రికార్డు సృష్టించారు.

ఇక అమ్మాజీ కూతురు జయచిత్ర 1976 లో వచ్చిన మా దైవం( Maa Daivam ) సినిమాతో మొదటిసారిగా ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించి మెప్పించింది.ఈ సినిమాలో రామారావు ఒక జైలర్ పాత్రలో కనిపించారు.ముద్దాయిలను మంచివాళ్లను చేయవచ్చు అని రామారావు నమ్ముతారు.అంతేకాదు నేరాలు చేసిన వారిని జైలుకు తీసుకువచ్చి వారిని మంచి వాళ్ళని చేసి వారి జీవితాల్లో వెలుగు నింపుతారు.
ఇక అంతకంటే ముందు 1959లో దైవబలం అనే సినిమా వచ్చింది.ఈ సినిమాలో జయ చిత్రా తల్లి జయశ్రీ అలియాస్ అమ్మాజీ తో ఎన్టీఆర్ నటించారు పొన్నలూరు వసంత కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈమూవీ హిట్ అయ్యింది.
ఎన్టీఆర్ ఖాతాలో అరుదైన రికార్డ్ కూడా చేరింది.ఆతరువాత కాని.అంతకు ముందు కాని ఇలాంటి సందర్భం ఫిల్మ్ ఇండస్ట్రీలోనే లేదు అని చెప్పాలి.