హీరోయిన్ నయనతార,( Nayanthara ) హీరో ధనుష్( Dhanush ) మధ్య ఎప్పటినుంచో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే.గత కొద్దీ రోజులుగా వీరి పేర్లు సోషల్ మీడియాలో మారు మోగుతున్నాయి.
బియాండ్ ది పెయిరీ అనే డాక్యుమెంటరీ విషయంలో వీరి మధ్య వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.ధనుష్ తీరును తప్పుబడుతూ నయన్ ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు.
దీనిపై తాజాగా నయనతార క్లారిటీ ఇచ్చారు.ఆమె అలా చేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు.
డాక్యుమెంటరీ( Documentary ) విషయంలో ఏం జరిగింది అన్న విషయాన్ని తెలిపారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.ధనుష్ గురించి లేఖ రిలీజ్ చేసేంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది? అని విలేకరి ప్రశ్నించగా.న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి.పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్ఠలను దెబ్బతీసే మనిషిని కాదు నేను.నా డాక్యుమెంటరీ ఫిల్మ్ పబ్లిసిటీ కోసమే మేము ఇదంతా చేశానని చాలామంది మాట్లాడుకుంటున్నారు.
అందులో నిజం లేదు.వీడియో క్లిప్స్ కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్ ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నించాము.
విఘ్నేశ్( Vighnesh ) కాల్స్ చేశాడు.నేను ఫోన్స్ చేసాను.
కామన్ ఫ్రెండ్స్ కూడా ఫోన్స్ చేశారు.ఎంత ప్రయత్నించినా మాకు ఎన్‌వోసీ( NOC ) రాలేదు.
సినిమాలో ఉపయోగించిన నాలుగు లైన్ల డైలాగ్ మా డాక్యుమెంటరీ ఫిల్మ్ లో ఉపయోగించాలనుకున్నాము.

ఆ మాటలు మా జీవితానికి ఎంతో ముఖ్యమనుకున్నాము.ఈ విషయంపై ఆయన మేనేజర్‌ను కూడా సంప్రదించాను.ధనుష్ తో ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పాను.
ఆయనకు నాపై ఎందుకు కోపం వచ్చింది? ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? పక్కవాళ్లు చెప్పిన మాటలు ఏమైనా వింటున్నారా? ఇలాంటి విషయాలు క్లియర్ చేసుకోవడానికి ఆయనతో ఒక్కసారి మాట్లాడాలనుకున్నాను.కాకపోతే అది జరగలేదు.
ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు.ఆయన నాకు మంచి మిత్రుడు.
కాకపోతే ఈ పదేళ్లలో ఏం జరిగిందో నాకు తెలియదు అని నయన చెప్పుకొచ్చింది.ఈ సందర్భంగా నయనతార చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.