సినీ నటుడు నాగచైతన్య (Nagachaitanya)శోభిత (Sobhita) వివాహం డిసెంబర్ 4వ తేదీ ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.వీరి వివాహపు వేడుక అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలోనూ అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది.
ఇక పెళ్లి తర్వాత శోభిత నాగచైతన్య పెళ్లికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు అయితే తాజాగా శోభితకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది పెళ్లికూతురుగా ముస్తాబైన ఈమె ఆనందంతో డాన్స్ చేస్తూ సందడి చేశారు.
ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియో పై నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.ఇక నాగచైతన్య అంటే శోభితకు ఎంతో ఇష్టమని తనతో పెళ్లి కోసం ఎంతగానో ఎదురు చూశానని ఈమె పలు సందర్భాలలో తెలియజేశారు.
ఇక చైతన్య ఎంతో ప్రశాంతంగా ఉండాలని ఆయన హుందాతనమే నన్ను ప్రేమలో పడేలా చేసింది అంటూ చైతన్యతో తన ప్రేమ గురించి కూడా శోభిత తెలియజేశారు.
ఇలా గత రెండు సంవత్సరాలుగా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట డిసెంబర్ 4వ తేదీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఒకటయ్యారు.ఇలా వీరి పెళ్లిపై ఎన్నో రకాల విమర్శలు కూడా వచ్చిన సంగతి తెలిసిందే.శోభిత కారణంగానే సమంత (Samantha ) విడాకులు తీసుకుంది అంటూ సమంత అభిమానులు కామెంట్లు చేస్తూ వచ్చారు.
ఇక నాగ చైతన్య కూడా సమంతను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు.అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు.అనంతరం నాగచైతన్య శోభిత ప్రేమలో పడి పెళ్లి చేసుకుని మరో కొత్త జీవితాన్ని ప్రారంభించారు.