లవర్ లేని చాలామంది ప్రజలు కపుల్స్ ని చూసినప్పుడు బాగా ఫీల్ అయిపోతుంటారు.ముఖ్యంగా సోషల్ మీడియాలో లవర్స్ పెట్టే ఫోటోలు, వీడియోలు చూసి తమకు కూడా అలా గర్ల్ ఫ్రెండ్( Girl Friend ) లేదే అని బాధపడిపోతుంటారు.
అయితే అలాంటి వారికి ఒక అదిరిపోయే ఐడియా ఇస్తున్నాడు కీసుకే జినుషి( Keisuke Jinushi ) అనే ఫోటోగ్రాఫర్.ఇతను రైటర్ కూడా.
జపాన్‌కు( Japan ) చెందిన జినుషి తన వినూత్న సోషల్ మీడియా పోస్టులతో ఇంటర్నెట్‌లో బాగా పాపులర్ అయ్యాడు.అతను రకరకాల వస్తువులు, ఒక విగ్గు, డిజిటల్ ఎడిటింగ్ ఉపయోగించి ఒక “కల్పిత ప్రేయసి”తో ఉన్నట్లుగా నిజమైన ఫోటోలను సృష్టిస్తాడు.
అంటే సోషల్ మీడియాలో ఆయన పెట్టే ఫోటోలు ఆయన ఒంటరితనాన్ని ఎవరికీ తెలియజేయవు అలాగే అతను కూడా ఆ ఫోటోలను చూసి మంచిగా ఫీలవుతుంటాడు.తెలిసిన వాళ్లు అతన్ని ఆ లవర్ ఎవరు అని అడిగినప్పుడు ఎంతో సంతోషిస్తాడు.
నిషినిప్పోన్ శింబున్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జినుషి ఈ ఫోటోలను ఎలా తీస్తాడో వివరించాడు.“నేను నా చేతికి ఫౌండేషన్ వేసి, మహిళల మృదువైన చేయిలా కనిపించేలా నెయిల్ పాలిష్ ఉపయోగించాను.దానికి ఒక స్క్రాంచీ (జుట్టుకు పెట్టుకునే రబ్బరు బ్యాండ్) జోడిస్తే, అది సరిగ్గా సరిపోతుంది,” అని అతను చెప్పాడు.జినుషి ముసాషినో ఆర్ట్ యూనివర్సిటీలో ఫిల్మ్, విజువల్ ఆర్ట్స్ కోర్స్ కూడా చేశాడు.
ఈ క్రియేటివ్ పర్సన్‌కి సోలో ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు ఈ ఫోటోల ఆలోచన వచ్చింది.అతను ఒక మహిళ విగ్రహం పక్కన నిలబడి, “నేను ఒంటరిగా ఉంటూనే హ్యాపీ కపుల్( Happy Couple ) ఫోటోలు ఎందుకు సృష్టించకూడదు?” అని అనుకున్నాడు.ఈ ఆలోచనే అతని ప్రత్యేకమైన ఫోటోగ్రఫీకి స్ఫూర్తినిచ్చింది.
అతని పోస్టులు సోషల్ మీడియాలో, ముఖ్యంగా సింగిల్ బాయ్స్‌లో( Single Boys ) ఫుల్లు పాపులర్ అయ్యాయి.చాలా మంది తమ సొంత హ్యాపీ కపుల్ ఫొటోస్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు.జినుషి తరువాత తన పనిని ‘ఫాంటసీ గర్ల్‌ఫ్రెండ్’( Fantasy Girlfriend ) అనే పుస్తకంగా ప్రచురించాడు.
ఈ పుస్తకం తన కల్పిత భాగస్వామితో కలవడం, వివాహం చేసుకోవడం, కుటుంబం కలిగి ఉండటం వంటి కథను హాస్యంగా చెబుతుంది.
అతని క్రియేటివిటీ అదుర్స్ అని చాలామంది మెచ్చుకుంటుండగా, కొందరు విమర్శకులు అతని పని జపాన్ ఒటాకు సంస్కృతిని ప్రతిబింబిస్తుందని భావిస్తున్నారు.
ఈ సంస్కృతి కొన్నిసార్లు సామాజిక ఒంటరితనాన్ని ప్రోత్సహిస్తుంది.అందుకే విమర్శకులు ఆందోళన చెందుతున్నారు.
జినూషి ఆలోచన ఆన్‌లైన్‌లో ఇలాంటి పోకడలను రేకెత్తించింది.షియావోహాంగ్‌షు, వీక్సిన్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో, మహిళలు బాయ్‌ఫ్రెండ్స్‌తో ఉన్నట్లు చిత్రాలను పోస్ట్ చేశారు.