శంకర్( Shankar ) దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ ( Hero Ram Charan )నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.కియారా అద్వానీ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.
తెలుగు తమిళ హిందీ భాషల్లో ఈ సినిమా వచ్చే సంక్రాంతికి జనవరి 10న గ్రాండ్గా విడుదల కానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ( Mega fans )ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని పోస్టర్లు పాటలు విడుదలైన విషయం తెలిసిందే.
ముఖ్యంగా పాటలకు మంచి స్పందన లభించింది.

ఈ పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ముఖ్యంగా మూడో సాంగ్ గా వచ్చిన నా నా హైరానా.పాటను మేకర్స్ రీసెంట్‌గా విడుదల చేయగా సోషల్ మీడియాలో 47 మిలియన్ వ్యూస్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ ఇంకా టాప్ లో ట్రెండ్ అవుతూ ఉంది.
అయితే ఈ పాట మేకింగ్ కు సంబంధించి తాజాగా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.శంకర్ సినిమాలలో ఉండే భారీతనం తెలియంది కాదు.గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి పాటలను చిత్రీకరించటంలో తనకు తానే సాటి అని ఆయన నిరూపించుకుంటున్నారు.

హైరానా పాటని న్యూజిలాండ్‌లో( New Zealand ) 6 రోజుల పాటు ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్‌ఫ్రా కెమెరాతో చిత్రీకరించారట.ఒక్కో సన్నివేశం ఒక్కో పెయింటింగ్ లా విజువల్ బ్యూటీగా మలిచారు శంకర్.దీని కోసం ఎంటైర్ టీమ్ ఎంతో కష్టపడిందట.
హీరో రామ్ చరణ్ అయితే న్యూజిలాండ్ లోని ఆక్‌లాండ్ నుంచి పాటను చిత్రీకరించిన క్రిస్ట్ చర్చ్ లొకేషన్ కు హెలికాఫ్టర్ లో వెళ్లారట.ఇక ఈ పాట చిత్రీకరణకే రూ.10 కోట్లు ఖర్చు పెట్టారంటే మామూలు విషయం కాదని చెప్పాలి.ఈ బడ్జెట్ తో మీడియం రేంజ్ హీరోతో ఒక సినిమా తీయవచ్చు.
అలాగే సినిమాటో గ్రాఫర్ తిరు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించిన తీరు అద్భుతమనే చెప్పాలి.మళ్లీ మళ్లీ చూడాలనుకునేంత గొప్పగా పాటలోని ప్రతీ ఫ్రేమ్ ఉంది.
ముఖ్యంగా ఈ సినిమాలోని బిజిఎం మ్యూజిక్ వినే కొద్ది మళ్లీ మళ్లీ వినాలి అనిపించేంతలా ఉంది.ఈ పాటను శ్రేయా ఘోషల్, కార్తీక్ పాడారు.
బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీని అందించారు.