వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ( YSR Congress Party )ఫైర్ బ్రాండ్ నాయకురాలుగా గుర్తింపు పొందిన నగరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ( Former MLA RK Roja )ప్రస్తుతం సైలెంట్ గా ఉంటున్నారు .ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి విమర్శలు చేస్తున్నారు తప్పితే సీరియస్ గా వ్యవహరించలేకపోతున్నారు.
అయితే ఇప్పుడు ఆ విమర్శలకు కూడా దూరంగానే ఉంటున్నారు.గత వైసిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రోజు దూకుడుగా వ్యవహరించేవారు.
తమ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడే వారు.ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు , ఆయన కుమారుడు లోకేష్ ( Lokesh )ను టార్గెట్ చేసుకుని రోజా విమర్శలు చేస్తూ ఉండేవారు.
వైసిపి ఓటమి తో పాటు, నగరిలో రోజా ఘోరంగా ఓటమి చెందడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ( Gali Bhanu Prakash )చేతిలో రోజా ఓటమి చెందారు.దాదాపు 45 వేల ఓట్ల తేడాతో ఆమె ఓటమి చెందారు .రోజా మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో సోదరుడు, భర్త పెత్తనంతో పాటు , నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులు నుంచి ఆమె వ్యతిరేకత ఎదుర్కోవడం వంటివన్నీ ఆమె ఓటమికి కారణం అయ్యాయి.ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోజా ను టార్గెట్ చేసుకోవడం , ఆమె మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అక్రమాలు జరిగాయి అంటూ ఫిర్యాదులు రావడం , ‘ఆడుదాం ఆంధ్ర ‘తో పాటు నగరిలో భూ ఆక్రమణలు, టిటిడి ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గోల్మాల్ జరగడం వంటి వ్యవహారాలపై సిఐడి దర్యాప్తు చేస్తోంది.దీంతో రోజా గతంతో పోలిస్తే దూకుడు తగ్గించారు .
నియోజకవర్గంలో పెద్దగా కనిపించడం లేదు.ఏపీ రాజకీయ అంశాల పైన అప్పుడప్పుడు మాత్రమే స్పందిస్తున్నారు. ఎక్కువగా చెన్నై , హైదరాబాదులోనే మకాం ఉంటున్నారు .ఇప్పుడు దూకుడుగా తాను విమర్శలు చేస్తే కూటమి ప్రభుత్వం తనపై చర్యలకు దిగుతుందని, కేసులు ఎదుర్కోక తప్పదని గ్రహించి ఆమె పొలిటికల్ గా సైలెంట్ గా ఉంటున్నారట.పార్టీ అధిష్ఠానం నుంచి ఆదేశాలు వస్తే తప్ప రోజా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసేందుకు ఆసక్తి చూపించను లేదు.ఒకవైపు కేసుల భయం మరోవైపు ఏం మాట్లాడినా ఇబ్బందులు తప్పవనే ఆలోచనతో రోజా మౌనంగా ఉంటున్నారట.
ప్రస్తుతం రాజకీయంగా సైలెంట్ గా ఉంటున్న రోజా మరోవైపు సినిమాల్లో మళ్ళీ బిజి అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారట.