టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.చిరంజీవి హీరోగా ఎన్నో సంచలన విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు ఇప్పటికీ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
చిరంజీవి స్టార్ (Chiranjeevi Star)స్టేటస్ ను అందుకోవడం వల్ల పవన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వగా పవన్ కూడా సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే.నాగబాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ అయ్యారు.
నాగబాబు సినీ కెరీర్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో విజయాలు ఉన్నాయి.అయితే ఒకే కుటుంబానికి చెందిన అన్నాదమ్ములు ఈ విధంగా సినిమాల్లో సక్సెస్ కావడం అరుదుగా జరుగుతుంది.అయితే ఈ ముగ్గురూ రాజకీయాల్లో కూడా సక్సెస్ కావడం గమనార్హం.2009 ఎన్నికల్లో చిరంజీవి ప్రజారాజ్యం(Chiranjeevi’s Praja Rajyam) పార్టీని స్థాపించి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు.ఆ తర్వాత రోజుల్లో చిరంజీవి పార్టీని విలీనం చేసి కాంగ్రెస్(Congress) తరపున మంత్రిగా పని చేశారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)రాజకీయాల్లో మొదట సక్సెస్ కాకపోయినా ప్రస్తుతం పాలిటిక్స్ తో బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.
నాగబాబుకు(Nagababu) సైతం త్వరలో మంత్రి పదవి దక్కబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ముగ్గురు హీరోలు సినిమాలు, రాజకీయాల్లో సక్సెస్ సాధించడం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం.

చిరంజీవి, నాగబాబు, పవన్ కెరీర్ (Chiranjeevi, Nagababu, Pawan)పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.ఈ హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.ఈ నటీనటుల రెమ్యునరేషన్లు సైతం ఒకింత భారీ స్థాయిలో ఉన్నాయి.మెగా హీరోలకు క్రేజ్ మాత్రం మామూలుగా లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి.మెగా హీరోలు రాబోయే రోజుల్లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారో చూడాల్సి ఉంది.