గత మూడు రోజుల నుంచి మంచు వారి కుటుంబం సంబంధించిన విషయాలు మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి.హీరో మంచు మోహన్ బాబు(Hero Manchu Mohan Babu), ఆయన చిన్న కొడుకు మంచు మనోజ్(Manchu Manoj) ల మధ్య పరస్పర తగదాల నడుమ అనేక విషయాల వల్ల ఇరువురు పోలీస్ కంప్లైంట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
తాజాగా జరిగిన సంఘటన నేపథ్యంలో మోహన్ బాబు, అతడి భార్య ఇద్దరు అనారోగ్యం నేపథ్యంలో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు.ఇకపోతే మంగళవారం రాత్రి జరిగిన ఘర్షణలో భాగంగా హీరో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై దాడి చేసిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనలో మోహన్ బాబు(Mohan babu) ప్రముఖ మీడియా ప్రతినిధిని వారి మైక్ తీసుకుని తలపై గట్టిగా కొట్టడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.దాంతో మీడియా ప్రతినిధిని హాస్పిటల్లో చేర్పించారు కూడా.
ఇదిలా ఉండగా.మీడియా ప్రతినిధి పై జరిగిన ఘటనపై ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్( senior journalist), ప్రస్తుత ఓ ప్రముఖ ఛానల్ అధినేతగా ఉన్న రవి ప్రకాష్(Journalist Ravi Prakash) తీవ్రంగా మోహన్ బాబు పై స్పందించారు.మనిషివా.మోహన్ బాబువా.అంటూ కాస్త ఘాటుగానే మొదలు పెడుతూ ఓ పోస్ట్ చేశారు.మోహన్ బాబు అదఃపాతాళానికి దిగజారాడని, మీడియాపై దాడులు ఏంటి అంటూ ప్రశ్నించారు.
ఇది అహంకారమే కాదు సిగ్గుచేటు అంటూ.ఇలాంటి బిహేవియర్ ను ఎవరు ఉపేక్షించారంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు.
మరోవైపు, హాస్పిటల్లో అడ్మిట్ అయిన మోహన్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ఇదివరకే ఓసారి తెలియజేశారు.హాస్పిటల్లో మోహన్ బాబు దంపతులతో పాటు మోహన్ బాబు మొదటి కుమారుడు విష్ణు (Vishnu)కూడా అక్కడే ఉన్నాడు.చూడాలి మరి వీరి మధ్య ఘర్షణ సంబంధించిన విషయాలు ఎంతవరకు తీసుకువెళ్తాయో.