గుడ్డు.సంపూర్ణ ఆహారం అని అంటారు.
ఎందుకంటే, మానవ శరీరానికి అత్యవసరమైన తొమ్మిది ప్రోటీన్లు గుడ్డులో ఉంటాయి.అలాగే విటమిన్స్, మినరల్స్, యాంటా ఆక్సిడెంట్స్, ఫోలేట్, కోలిన్, బీటా కేరోటిన్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
అందుకే రోజుకొక గుడ్డు తీసుకుంటే.ఆరోగ్యం పదిలంగా ఉంటుందని నిపుణులు ఎప్పటికప్పుడు చెబుతుంటారు.
అయితే ఆరోగ్యానికి ఎంత మేలు చేసినప్పటికీ.గుడ్డు విషయంలో పలు జాగ్రత్తలు పాటించాల్సి ఉంది.
ముఖ్యంగా గుడ్డుతో పాటుగా కొన్ని కొన్ని ఆహారాలను అస్సలు తీసుకో రాదు.మరి ఆ ఆహారాలు ఏంటీ? అన్నది ఆలస్యం చేయకుండా ఓ లుక్కేసేయండి.
గుడ్డు తిన్న వెంటనే టీ లేదా టీ తాగిన వెంటనే గుడ్డు ఎట్టిపరిస్థితుల్లో తీసుకోరాదు.ఎందుకంటే.గుడ్డు, టీ వెంట వెంటనే తీసుకుంటే మలబద్ధకం మరియు ఇతర జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
సాధారణంగా చాలా మంది గుడ్డును చక్కెరతో కలిపి తీసుకుంటుంటారు.
కానీ, ఇలా చేయడం వల్ల ఈ రెండింటి నుండి విడుదలయ్యే అమైనో ఆమ్లం శరీరానికి తీవ్ర హాని కలిగిస్తుంది.కాబట్టి, ఇకపై గుడ్డుతో పాటు షుగర్‌ను పొరపాటున కూడా తీసుకోకండి.
గుడ్డు తిన్న వెంటనే పండ్లు లేదా పండ్లు తిన్న వెంటనే గుడ్డు అస్సలు తినరాదు.గుడ్లు, పండ్లు ఒకేసారి తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్థం అయిపోతుంది.
దాంతో గ్యాస్, గుండెల్లో మంట, కడుపు నొప్పి వంటి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గుడ్డు, సోయా పాలు విడి విడిగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.అనేక జబ్బులనూ నివారిస్తాయి.
కానీ, వీటిని ఒకే సారి తీసుకుంటే మాత్రం.శరీరంలో ప్రోటీన్ కొరత ఏర్పడుతుంది.
ఇక గుడ్డుతో పాటుగా మాంసం, చేపలు వంటివి కూడా తినరాదు.