ప్రస్తుతం మహేష్ బాబు( Mahesh Babu ) రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే.ప్రస్తుతం మహేష్ బాబు ద్రుష్టి మొత్తం అంతా కూడా ఆ సినిమా పైనే ఉంది.
మరోవైపు రాజమౌళి కూడా ఈ సినిమాకు సంబంధించిన పనుల్లో బిజీ బిజీగా ఉన్నారు.ఈ సినిమా లొకేషన్ వేటలో ఉన్నారు జక్కన్న.
ఇకపోతే మహేష్ బాబు వాయిస్ ఇచ్చిన ముఫాసా( Mufasa ) అనే యానిమల్ సినిమా ఈవారం రాబోతున్న విషయం తెలిసిందే.కనీసం ఆ సినిమా కోసం ఒక వీడియో బైట్ ని ఇవ్వలేదు మహేష్.
ఎదో పోస్టర్ లాంచ్ వుంటే నమ్రత వెళ్లారు కానీ మహేష్ మాత్రం తన లుక్ ని బయటికి చూపించలేదు.

అంత జాగ్రత్తగా తన సినిమా పనిలో ఉన్నారు.అయితే అలాంటి మహేష్ బాబు మీద ఇప్పుడో న్యూస్ ఛానల్ వింత ప్రచారం చేస్తోంది.మహేష్ బాబు అభిమానులని ఆయన పీఆర్ టీం వైసీపీ( YCP ) వైపు మళ్ళిస్తుందని ఆ న్యూస్ ఛానల్ ఆరోపణలు చేస్తోంది.
దీనికి సంబధించిన ఆధారాలు వారి దగ్గర ఏమి ఉన్నాయో గానీ ప్రముఖ న్యూస్ ఛానల్ ఎక్స్ హ్యాండిల్ లో ఈ వార్త రావడం మహేష్ బాబు ఫ్యాన్స్ కే విస్మయానికి గురి చేసింది.ఈ పోస్ట్ ని ప్రచురించి ఆ న్యూస్ ఛానల్ పై మహేష్ ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
రీచ్ కోసం మహేష్ పేరుని ఇలా వాడుకోవడం దారుణం అంటున్నారు.

రాజకీయాలతో సంబంధం లేని మహేష్, ఆయన ఫ్యాన్స్ ని ఇందులోకి ఎందుకు లాగుతున్నారని ప్రశ్నిస్తున్నారు.పీఆర్ అనే ట్యాగ్ తగిలించి మహేష్ ఫ్యాన్స్ పై( Mahesh Fans ) అలాంటి నిందలు వేయడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు.అయితే నిజానికి మహేష్ బాబు దగ్గర అఫీషియల్ పీఆర్ టీం లేదు.
బిఏ రాజు వున్నప్పుడు మహేష్ వ్యవహారాలన్నీ ఆయనే చూసుకునేవారు.ఆయన తర్వాత అఫీషియల్ గా ఎవరినీ పెట్టుకోలేదు.
ఆయన సినిమా చేసినప్పుడు ఆ నిర్మాత నుంచి వచ్చిన పీఆర్ టీమే సినిమా పూర్తయిన వరకు ఏమైనా అఫీషియల్ అప్డేట్స్ ఇస్తుంది.మహేష్ పేరు చెప్పుకొని పీఆర్ అని చెలామణీ అవుతుంటే అది ఆయనకి సంబంధం లేదు.