ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరుగుతుందని సంతోష పడిన, మరోవైపు సైబర్ నేరగాళ్ల ( Cybercriminals )వల్ల బాధపడాల్సిన సంఘటనలు కూడా చాలానే జరుగుతున్నాయి.రోజుకో కొత్త రకం మోసాన్ని కనిపెట్టి ప్రజల నుంచి వారు దాచుకున్న సొమ్మును తెలివిగా కొట్టేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర ప్రభుత్వం పథకం కింద లోన్ ఇప్పిస్తామంటూ నమ్మబలికి మోసాలకి పాల్పడుతున్నారు కొందరు సైబర్ నేరగాళ్లు.ఇదివరకు కాలంలో తాము బ్యాంకులో నుండి ఫోన్ చేస్తున్నామని వారికి సంబంధించిన అకౌంట్ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ( Account Debit Card, Credit Card )వాటి వివరాలు సేకరించి డబ్బులు కొల్లగొట్టేవారు.
అయితే ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలియడంతో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతులను అనుసరిస్తున్నారు.ఇందులో భాగంగానే తాజాగా కేంద్ర ప్రభుత్వం పథకం కింద డబ్బులు వచ్చాయంటే ఓ వ్యక్తి నమ్మి మోసపోయాడు.
ఈ ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది.రాష్ట్రంలోని కోజికోడ్ ( Kozhikode )ప్రాంతానికి చెందిన షాజి ( Shaji )కు ప్రధానమంత్రి ముద్ర లోన్ మంజూరు అయిందని చెప్పి ఓ మెసేజ్ వచ్చిందని తెలిపారు.
అయితే అది వచ్చింది నిజమే అని అనుకున్న వ్యక్తి మెసేజ్లను లింక్ క్లిక్ చేశాడు.ఇంకేముంది చాలా సులువుగా అతడు సైబర్ నేరగాల్లో ఉచ్చులో పడిపోయాడు.
దీంతో అతనికి డబ్బులు పై ఉన్న ఆశని పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అనుమానం రాకుండా ఓ ఫారం నింపాలని అందులో సూచించారు.అందుకు తగ్గట్టుగానే షాజీ చేశాడు.ఇక అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత మీకు ముద్ర లోన్ మంజూరు అయిందని అందుకు సంబంధించి 50 వేల రూపాయలు మీకు వస్తాయని తెలిపారు.అయితే ఆ డబ్బులు మీరు పొందాలంటే బీమా చెల్లించాల్సి ఉంటుందని తెలుపుతూ.అందుకోసం రూ.3750 చెల్లించాలని తెలిపారు.అయితే తనకి 50,000 వస్తున్నాయన్న ఆశతో అతడు వెంటనే వారికి డబ్బులు చెల్లించాడు.ఆ తర్వాత అతనికి అకౌంట్లో డబ్బులు పడ్డట్లు అతని ఫోనుకు ఓ మెసేజ్ కూడా వచ్చింది.
కాకపోతే అతడి అకౌంట్ లో మాత్రం డబ్బులు జమ కాలేదు.
దానితో తన అకౌంట్లో డబ్బులు క్రెడిట్ కాలేదని మోసగాళ్లకు తెలపగా నీకు రావాల్సిన 50000 ఇంకా ప్రాసెసింగ్ లో ఉన్నాయని మరో 9000 చెల్లిస్తే మొత్తం డబ్బులు మీ అకౌంట్లో పడేలా చూస్తామని నమ్మబలికారు.అయితే ఇదేదో తేడాగా ఉందని గ్రహించిన వ్యక్తి తనకు ఏ లోను వద్దు ఇప్పటికే చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని అడిగాడు.అయితే తమ మోసం బయటపడడంతో సదరు సైబర్ నేరగాళ్లు బ్లాక్ మెయిల్ చేస్తూ మంజూరైన ముద్ర లోన్ రద్దు చేయాలంటే వెయ్యి రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుందని మరోసారి మోసం చేసేందుకు ప్రయత్నం చేశారు.
అయితే రుణం తీసుకుంటున్నట్లు తమ వద్ద పత్రాలు ఉన్నాయని డబ్బులు ఇవ్వకపోతే న్యాయమైన చర్యలు తీసుకుంటామని బెదిరింపులు తెలిపారు.అంతేకాకుండా అతని ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని వాటిని మార్ఫింగ్ చేసి అసభ్యంగా సృష్టించి వారిని తనకి తెలిసిన వారిపై పంపిస్తాను అంటూ బెదిరించాడు.
దాంతో విసుగు చెందిన వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాడు.దానితో కేసును నమోదు చేసుకున్న పోలీసులు మోసపోయిన వ్యక్తికి వచ్చిన ఫోన్ కాల్ నెంబర్ ఆధారంగా సైబర్ నేరగాళ్లను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
కాబట్టి మీరు కూడా ఇలాంటి వాటికి బలవకుండా జాగ్రత్తగా ఉండండి.