ఇదివరకు రాజుల కాలంలో పావురాలను పోస్ట్ మ్యాన్(Postman with pigeons) గా ఉపయోగించే వారని మనం అనేకమార్లు వినే ఉంటాము.పావురాలు లేదా మరో రకమైన పక్షులు వందల కిలోమీటర్ల ప్రయాణం చేసి ఉత్తర ప్రత్యుత్తరాలు అందించేవి.
వీటికి సంబంధించిన విషయాలను కొన్ని సినిమాలలో మనకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తారు.ఇకపోతే టెక్నాలజీ జీవితంలో వీటి అవసరం లేకుండా పోయిందని చెప్పవచ్చు.
దీనికి కారణం వాట్సాప్, జిమెయిల్(WhatsApp, Gmail) ఇంకా అనేక టెక్నాలజీల ఉపయోగం ద్వారా సమాచారం చాలా సులువుగా క్షణాలలో చేరవేస్తున్నారు.అయితే, అసలు ఎందుకు ఈ ప్రస్తావనన్న విషయానికి వస్తే.
ఓ మహిళ వారు పెంచుకుంటున్న పావురానికి బాగానే ట్రైనింగ్ ఇచ్చింది.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు పావురం(Pigeons) ఏం చేసిందన్న విషయానికి వెళ్తే.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పావురం గురించి చూస్తే.
ఓ మహిళ తన ఇంట్లో ఓ పావురాన్ని పెంచుకుంటుంది.ఇక వీడియోలో మొదట్లో ఇంట్లోని మంచంపై ఒక మహిళ ఓ వ్యక్తి కూర్చుని ఉండగా వారి వద్ద పావురం కనబడుతుంది.
ఆ తర్వాత పావురానికి మెడకు ఓ కవర్ను తగిలించి బయటికి పంపిస్తారు.అలా పావురం కవర్ ను తలకు తగిలించుకొని సంతోషంగా ఇంటి నుంచి బయటకు వెళ్లి ఏకంగా కిరాణా (Groceries)కొట్టుకు వెళ్లడం మనం చూడవచ్చు.
అయితే, ఆ కిరాణా కొట్టు యజమాని కూడా ఈ పావురం ఎవరిది? ఏమి ఇవ్వాలని విషయాలు తెలుసు కాబోలు.అందుకే పావురం తన దగ్గరికి వస్తేనే చాలా ఆప్యాయంగా దాని దగ్గరికి తీసుకొని అతని చేతులపై నిలబెట్టుకున్నాడు.
అలా వచ్చిన పావురానికి ఉన్న కవర్ను తీసి అందులో ఒక మ్యాగీ ప్యాకెట్(Maggi packet) పెట్టాడు.ఆ తర్వాత మ్యాగీ ప్యాకెట్ ఉన్న కవర్ను మళ్ళీ పావురం తలకు తగిలించడంతో.అది హాయిగా ఎగురుకుంటూ తిరిగి తన యజమానురాలు దగ్గరికి చేరింది.దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు.అక్క.
పావురానికి ఏమైనా ట్రైనింగ్ ఇచ్చావా అంటూ కొందరు కామెంట్ చేస్తుండగా, మరికొందరేమో ఇదివరకు కాలంలో పోస్ట్ మాన్ ఉద్యోగాలు చేసేవి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు.ఇంకొందరు ఈ పావురం టాలెంట్ మామూలుగా లేదుగా అని కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఈ వీడియోకి రెండు మిలియన్స్ కు పైగా వ్యూస్ వచ్చాయి.