ప్రసవం అనంతరం చాలా మంది మహిళలు సర్వ సాధారణంగా ఫేస్ చేసే సమస్యల్లో హెయిర్ ఫాల్ ముందు వరసలో ఉంటుంది.ఆ సమయంలో తలెత్తే హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, పోషకాల కొరత, పలు రకాల మందుల వాడకం, జుట్టు సంరక్షణ లేకపోవడం వంటి రకరకాల కారణాల వల్ల జుట్టు అధికంగా ఊడిపోతూ ఉంటుంది.
దాంతో ఈ హెయిర్ ఫాల్‌కు ఎలా చెక్ పెట్టాలో తెలియక స్త్రీలు తెగ టెన్షన్ పడిపోతూ ఉంటారు.అయితే ఇప్పుడు చెప్పబోయే ఆయిల్‌ను యూస్ చేస్తే ప్రసవం తర్వాత ఎదురయ్యే హెయిర్ ఫాల్ సమస్యను సమర్థవంతంగా నివారించుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఆయిల్ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా కొన్ని ఉసిరికాయలను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి గింజ తొలగించి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కులు, రెండు రెబ్బల కరివేపాకు వేసుకుని వాటర్ పోయకుండా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఒక గ్లాస్ కొబ్బరి నూనెను పోసుకోవాలి.
అలాగే ఈ నూనెలో ఉసిరికాయ-కరివేపాకు పేస్ట్, రెండు టేబుల్ స్పూన్ల బృంగరాజ్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ నిమ్మ గింజలు వేసుకుని బాగా కలిపి.చిన్న మంటపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి.ఇలా ఉడికించుకున్న మిశ్రమాన్ని పూర్తిగా చల్లారబెట్టుకుని.
అప్పుడు పల్చటి వస్త్రం సాయంతో ఆయిల్‌ను సపరేట్ చేసుకోవాలి.
ఈ ఆయిల్‌ను ఏదైనా బాటిల్‌లో నింపుకుంటే ఇరవై రోజుల పాటు వాడుకోవచ్చు.
రాత్రి నిద్రించే ముందు ఈ ఆయిల్‌ను జుట్టు మొత్తానికి పట్టించి.మరుసటి రోజు మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్ క్రమంగా అదుపులోకి వస్తుంది.