టాలీవుడ్ ఇండస్ట్రీలోని లక్కీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి( Meenakshi Chaudhary ) ఒకరు.ఈ మధ్య కాలంలో ఈ బ్యూటీ నటించిన లక్కీ భాస్కర్,( Lucky Bhaskar ) మెకానిక్ రాకీ( Mechanic Rocky ) సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్లుగా నిలవగా మిగతా సినిమాలు మాత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేదు.
అయితే మీనాక్షి చౌదరి గురించి ఆమెలో ఉన్న టాలెంట్ గురించి చాలామందికి తెలియదు.ఈ ఏడాది గుంటూరు కారం( Guntur Kaaram ) సినిమాతో మీనాక్షి కమర్షియల్ హిట్ కూడా అందుకున్నారు.
తమిళంలో కూడా మీనాక్షి చౌదరి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్నారు.కొలై అనే సినిమాతో ఆమె బిజీగా ఉన్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలోని బిజీ హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు కాగా కొన్ని సినిమాలలో మీనాక్షి వయస్సుకు మించిన పాత్రలలో నటిస్తుండటం గమనార్హం.మీనాక్షి చౌదరి హీరోయిన్ మాత్రమే కాదని బ్యాట్మింటన్ లో( Badminton ) స్టేట్ లెవెల్ ప్లేయర్ అని చాలా తక్కువమందికి తెలుసు.
క్రీడల్లో రాణించి సినిమాల్లో సైతం సక్సెస్ సాధించిన హీరోయిన్లు చాలా తక్కువమంది ఉంటారు.మీనాక్షి చౌదరి సైతం ఆ జాబితాకు చెందిన వారేనని చెప్పాలి.తాను హీరోయిన్ అవుతానని అస్సలు ఊహించలేదని ఈ బ్యూటీ చెబుతున్నారు.సరైన సినిమాలను ఎంచుకుంటే మీనాక్షి చౌదరికి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ విజయాలు దక్కే అవకాశాలు మాత్రం పుష్కలంగా ఉన్నాయి.
పాన్ ఇండియా డైరెక్టర్లు మీనాక్షి చౌదరికి మూవీ ఆఫర్లు ఇస్తే ఆమె కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.మీనాక్షి చౌదరిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా సోషల్ మీడియాలో సైతం ఆమెకు క్రేజ్ అంచనాలకు మించి పెరుగుతోంద్.కెరీర్ విషయంలో మీనాక్షి ఆచితూచి అడుగులు వేస్తున్నారు.మీనాక్షి చౌదరి పారితోషికం కోటి రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.సోషల్ మీడియాలో సైతం ఈ బ్యూటీ క్రేజ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.