అమ్మాయి మాదిరిగానే ప్రతి అబ్బాయి జీవితంలోనూ పెళ్లి( Wedding ) అనేది ఒక ముఖ్యమైన ఘట్టం.అటువంటి సమయంలో గ్లామరస్ గా మరియు ఎట్రాక్టివ్ గా కనిపించడం చాలా అవసరం.
అందుకే పెళ్లి సెట్ అవ్వగానే అమ్మాయిలు స్కిన్ విషయంలో చాలా కేర్ చూపెడుతుంటారు.మరి అబ్బాయిల సంగతేంటని అనుకోవద్దు.
పెళ్లి కూతురి మాదిరిగా, పెళ్లి కొడుకులు( Groom ) కూడా అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలనుకుంటే కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
వివాహానికి నాలుగు నెలల ముందు లేదా కనీసం రెండు ముందు నుంచి చర్మ సంరక్షణను( Skin Care ) మొదలుపెట్టండి.
ఇది చర్మ సమస్యలను తగ్గించడమే కాకుండా, మీకు అవసరమైన గ్లో అందించడానికి సహాయపడుతుంది.స్కిన్ రోటీన్ విషయానికి వస్తే.చర్మంపై దుమ్ము, ధూళి, చెమట, మరియు అదనపు నూనెను తొలగించడానికి రోజులో రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి.ఇందుకోసం సల్ఫేట్-రహిత క్లెన్సర్‌ను ఉపయోగించాలి.
వారంలో రెండుసార్లు చర్మంపై మృత కణాలను తొలగించేందుకు స్క్రబ్ చేయండి.హార్ష్ స్క్రబ్బుల బదులు నేచురల్ ఎక్స్‌ఫోలియేటింగ్ ఉత్పత్తులను వాడండి.అంటే తేనె-ఓట్స్ స్క్రబ్, తేనె-షుగర్ స్క్రబ్, ఓట్స్-పెరుగు స్క్రబ్ వంటివి ఉపయోగించండి.
అలాగే మీ చర్మ టైప్ కి సెట్ అయ్యే విధంగా మాయిశ్చరైజర్‌ను( Moisturizer ) ఎందుకుని రెగ్యులర్ గా ఉపయోగించండి.
మాయిశ్చరైజర్ చర్మాన్ని హైడ్రైట్ చేసి సున్నితంగా ఉంచుతుంది.ట్యాన్, సన్‌బర్న్, మరియు ముందస్తు ముడతలను తగ్గించడంలో సన్‌స్క్రీన్( Sunscreen ) ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.కాబట్టి మాయిశ్చరైజర్ అప్లై చేశాకా రోజూ ఎస్‌పిఎఫ్ 30+ సన్‌స్క్రీన్ ను వాడండి.
గడ్డం ఉంచేవారైతే.క్వాలిటీ బర్డ్ ఆయిల్ ఉపయోగించండి.దాంతో గడ్డం( Beard ) మెత్తగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.
చర్మాన్ని రక్షించుకునేందుకు షేవ్ చేసుకునేవారు హైడ్రేటింగ్ షేవింగ్ క్రీమ్ ను వాడండి.
ఆరోగ్యం బాగుండాలన్నా, చర్మం సహజంగా మెరిసిపోవాలన్నా ఒంటికి సరిపడా నీటిని అందించడం చాలా అవసరం.
రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగండి.తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, సీడ్స్, మరియు ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి.
తద్వారా చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
అలాగే అధిక ఒత్తిడి వల్ల మొటిమలు వస్తాయి.
కాబట్టి మొటిమలకు దూరంగా ఉండటం కోసం యోగా, ధ్యానం, లేదా వ్యాయామం చేయండి.కంటి నిండా నిద్ర ఉండేలా చూసుకోండి.
కంటి చుట్టూ నల్లటి వలయాల ఉంటే విటమిన్ C కలిగిన ఐ క్రీమ్‌ను ఉపయోగించి వాటిని తగ్గించుకోండి.పెదవుల సంరక్షణ కోసం రోజూ లిప్ బామ్ వాడడం అలవాటు చేసుకోండి.
త్వరలో పెళ్లి చేసుకోబోయే అబ్బాయిలు ఈ చిట్కాలను పాటించడం ద్వారా మీరు మీ పెళ్లి రోజున సూపర్ గ్లామరస్ గా కనిపిస్తారు అనడంలో సందేహమే లేదు.