నటి కిరీటి రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇటీవల హరికథ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో భాగంగా పరోక్షంగా అల్లు అర్జున్ (Allu Arjun) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారంటూ అల్లు అర్జున్ అభిమానులు ఈయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కలియుగంలో వస్తున్న కథలు చూస్తున్నారు కదా.
నిన్న కాక మొన్న చూశాం.వాడెవడో ఎర్ర చందనం(Red sandalwood) స్మగ్లింగ్ చేసే దొంగ వాడు.
వాడు కూడా హీరోనే అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి.

ఇక రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఎక్కడా కూడా పుష్ప సినిమా పేరుగాని అల్లు అర్జున్ పేరు గాని ప్రస్తావించలేదు కానీ గత మూడు రోజుల క్రితం విడుదలైన సినిమా పుష్ప 2(Pushpa 2) .ఈ సినిమాలో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు దీంతో కచ్చితంగా ఈయన అల్లు అర్జున్ గురించే మాట్లాడారు అంటూ అల్లు అర్జున్(Allu Arjun) అభిమానులు రాజేంద్రప్రసాద్ ను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేస్తూ వచ్చారు.ఈ విధంగా బన్నీ ఫాన్స్ భారీ స్థాయిలో ఈయనపై ట్రోల్స్ చేస్తున్న నేపథ్యంలో ఈ వివాదం గురించి రాజేంద్రప్రసాద్ స్పందించారు.

ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.తాను చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్ ఉద్దేశించి చేశారని కొంతమంది భావిస్తున్నారు అయితే అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.అల్లు అర్జున్ నాకు కొడుకుతో సమానం.అతడిని అలా అంటానా.బన్నీ నువ్వు నా బంగారం లవ్ యూ అంటూ రాజేంద్రప్రసాద్ తెలిపాడు.నేను పుష్ప సినిమాపై నెగిటివ్‌గా మాట్లాడానని వచ్చిన వార్తలు చూసి చాలా నవ్వుకున్నాను అని తెలిపారు.
ఇన్ని సంవత్సరాల కాలంలో నేను ఎలాంటి వివాదాలలో చిక్కుకోలేదు అలాంటిది నా గురించి మొదటిసారి ఇలాంటి వార్త రావడంతో ఎంజాయ్ చేశాను.ఇక ఈ వార్త ఎవడు రాశాడు కానీ వాడికి నేను ఒకటే చెబుతున్న అల్లు అర్జున్ నా కొడుకుతో సమానం ఆయనని ఉద్దేశించి నేను మాట్లాడలేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.