టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి( Sai pallavi ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే ఎంతో అద్భుతమైన సినిమాలను ఎంపిక చేసుకుని స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నారు.
ప్రస్తుతం తెలుగు మాత్రమే కాకుండా తమిళ మలయాళ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.సాయి పల్లవి సినిమాల వరకు తన పను తాను చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు ఈమె ఎలాంటి వివాదాలలోకి రారు.
కానీ ఇటీవల కాలంలో కొన్నిసార్లు సాయి పల్లవి కూడా ఎన్నో విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.

ఇకపోతే తాజాగా సాయి పల్లవి తన గురించి అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారి పట్ల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇదే విషయం గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది.నా విషయంలో ప్రతిసారి ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్యపు వార్తలను ప్రచారం చేస్తున్నారు.
అయితే ఆ వార్తలను చూసిన ప్రతిసారి తాను మౌనంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను కానీ ఇకపై అలా మౌనం వహించననీ తెలిపారు.

ఎంతో పేరు ఉన్నటువంటి కొన్ని పత్రికలు అలాగే కొన్ని సోషల్ మీడియా పేజీలలో కూడా నా గురించి తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారు.ఇకపై ఇలాంటి వార్తలను కనుక ప్రచారం చేస్తే వారి పట్ల ఖచ్చితంగా చట్టపరమైన చర్యలను తీసుకుంటాను అంటూ సాయి పల్లవి కొన్ని మీడియా ఛానళ్లకు వెబ్ సైట్లకు తనదైన శైలిలోనే వార్నింగ్ ఇస్తూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్ రామాయణం( Ramayanam ) సినిమాలో నటిస్తున్నారు.
ఈ సినిమాలో సీతగా నటిస్తున్న నేపథ్యంలో ఈమె చికెన్ కూడా తినడం మానేసిందని ఎక్కడికి వెళ్లినా తన చెఫ్ బృందాన్ని కూడా తీసుకువెళ్తుంది అంటూ కూడా వార్తలు వస్తున్నాయి.మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియదు కానీ తన ప్రమేయం లేకుండా వస్తున్న వార్తలపై మాత్రం సాయి పల్లవి సీరియల్స్ అయ్యారు.