సినిమా సూపర్‌హిట్ కావాలంటే ప్రేక్షకుల ఆదరణ వేరే రేంజ్‌లో ఉండాలి.అప్పుడే నిర్మాతపై కనకవర్షం కురుస్తుంది.
అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను చూస్తేనే బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంది డబ్బులు కూడా బాగా వస్తాయి.ముఖ్యంగా మహిళ ప్రేక్షకులు సినిమాకి రావాల్సి ఉంటుంది.
వారి పూర్తిగా సినిమాని రిజెక్ట్ చేస్తే సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడం అసాధ్యం కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు సూపర్ స్టార్ కృష్ణ.(Super Star Krishna)
లేడీ ఆడియన్స్ ఎవరూ రాకపోయినా కృష్ణ (krishna)సినిమా థియేటర్స్‌లో బాగా ఆడింది.
పెట్టిన బడ్జెట్ కి నాలుగు రెట్లు ఎక్కువ డబ్బులు వసూలు చేసింది.ఆ సినిమా మరేదో కాదు ఇండియాలో వచ్చిన మొట్టమొదటి వెస్ట్రన్ ఫిలిం ‘మోసగాళ్ళకు మోసగాడు’(Mosagallaku Mosagadu).
శ్రీ పద్మాలయా మూవీస్ పతాకంపై కృష్ణ సోదరులు దీన్ని ప్రొడ్యూస్ చేశారు.ఈ సినిమా టెక్నికల్ వాల్యూస్ హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు.
ఇది చాలా థియేటర్లలో వంద రోజులు ఆడింది.సూపర్‌స్టార్ కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు(G.adi seshagiri rao) ఈ మూవీ క్రియేట్ చేసిన బాక్సాఫీస్ రికార్డ్స్ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

కృష్ణ ఇందులో ఎన్నో సాహసాలు చేశారు.ఈ సినిమా తీయాలని నిర్ణయించుకోవడమే పెద్ద సాహసం అని చెప్పుకోవచ్చు.కౌబాయ్ జోనర్‌లో కూడా మొదటగా సినిమాలు చేసింది మన కృష్ణనే.గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ(Good bad and ugly) సినిమా ద్వారా ఆయన ఈ మూవీ తెలుగు నేటివిటీతో చేయాలని అనుకున్నారు.
ఆరుద్రకు అదే విషయం చెప్తే ఆయన తెలుగులో క్యారెక్టర్లు మార్చాలని సలహా ఇచ్చారు.ఆ సినిమాతోపాటు మెకన్నాస్ గోల్డ్ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్‌ని మిక్స్ చేస్తే మూవీ ఇంకా బాగా వస్తుందని అన్నారు.“మరి ఇంకెందుకు ఆలస్యం సినిమా కథ రెడీ చేయండి” అని కృష్ణ ఆరుద్రను కోరారు.

అందుకు ఓకే చెప్పిన ఆరుద్ర నెలరోజుల్లో “మోసగాళ్లకు మోసగాడు” (Mosagallaku Mosagadu) స్టోరీ రెడీ చేసి కృష్ణకి వినిపించారు.అది నచ్చడంతో షూటింగ్ ప్రారంభించారు.రూ.7 లక్షల బడ్జెట్‌తో సినిమా పూర్తయింది.సినిమాలోని ప్రొడక్షన్ వాల్యూస్ చూసే చాలామంది ఈ మూవీకి కనీసం రూ.15 లక్షలు బడ్జెట్ అయి ఉంటుందని భావించారు కానీ, బడ్జెట్‌ని కంట్రోల్ చేస్తూ 7 లక్షల్లోతో పూర్తి చేయించారు కృష్ణ.ఈ సినిమా షూటింగ్ లొకేషన్‌కి ఒకరోజు నిర్మాత నాగిరెడ్డి (B.
Nagi Reddy)వచ్చారు.ఆ సమయంలో ఇలాంటి సినిమాలు తెలుగులో ప్రేక్షకులు చూడటం కష్టమేనన్నారు.దాంతో భయపడిపోయిన కృష్ణ వెంటనే ఎన్టీఆర్ జడ్జిమెంట్ తీసుకుందామనుకున్నారు.ఎన్టీఆర్ కు సినిమా వేసి చూపించారు.అది చూసి రామారావు ఫిదా అయ్యారు.

‘ఇది మాస్ సినిమా, తప్పకుండా హిట్ అవుతుంది.కానీ లాంగ్ రన్ ఆశించకూడదు.లేడీ ఆడియన్స్ కూడా వచ్చే అవకాశం ఉండదు.” అని నిరుత్సాహపరిచారట.అయినా కృష్ణ భయపడకుండా సినిమాని రిలీజ్ చేశాడు.
ఎన్టీఆర్(NTR) చెప్పినట్టే సినిమాకి మహిళా ప్రేక్షకులు ఎవరూ రాలేదు.కానీ మగవారు మాత్రం పెద్ద సంఖ్యలో రావడం వల్ల మూవీ పెద్ద హిట్ అయింది.
అయినా కృష్ణ చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది.ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బడ్జెట్ కు నాలుగు రెట్లు ఎక్కువగా డబ్బులు కూడా వసూలు చేసింది.