ఒక్క సీన్‌తోనే ఎలివేట్ అయిన సినిమాలు.. పాన్ ఇండియా రేంజ్‌లో సూపర్ హిట్..

ఒక సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే అందులో కథ చాలా బాగుండాలి.కొన్నిసార్లు ఒక్క సీను బాగున్నా సరే మూవీ బాగా ఎలివేట్ అవుతుంది.

 Tollywood Movies Elevated By One Scene , Tollywood Movies , Anji , Karthikeya 2-TeluguStop.com

ఆ ఒక్క సన్నివేశం కోసం థియేటర్‌కి వెళ్లి చూడొచ్చనే మౌత్‌ టాక్ కూడా మొదలవుతుంది.చివరికి ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.

అలా ఒక్క మంచి సన్నివేశంతో వందల, వేల కోట్లు కొల్లగొట్టిన కొన్ని సినిమాలు ఉన్నాయి.ఆ సీన్లు కొన్ని దశాబ్దాల పాటు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయంటే అతిశయోక్తి కాదు.మరి ఆ సీన్లు ఏంటి, అవి ఏ సినిమాల్లో ఉన్నాయనే వివరాలు తెలుసుకుందాం.

• అఖండ

( Akhanda )

బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్ట్ చేసిన యాక్షన్ డ్రామా ఫిల్మ్ “అఖండ”లో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే.తమన్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి పెద్ద హైలైట్.అయితే మ్యూజిక్, కథ, మిగతా వాటన్నిటికంటే ఈ మూవీలో ఒక సీన్ మరింత ఆకట్టుకుంది.ఇందులో బాలకృష్ణ అఖండ రుద్ర సికందర్ ఘోర అనే ఓ శక్తివంతమైన అఘోరా పాత్రలో నట విశ్వరూపం చూపించారు.అఘోరా అవతారంలో బాలకృష్ణ స్క్రీన్‌పై కనిపించగానే ప్రేక్షకులకు పూనకాలు వచ్చాయి.

ఇక బాలయ్య ఫైట్స్ చేయడం, తన అతీత శక్తులను ప్రదర్శిస్తున్నప్పుడు థియేటర్ దద్దరిల్లిపోయింది.ముఖ్యంగా క్లైమాక్స్‌లో విలన్ “వాడి ఒంట్లో ఉన్నది శివుడు” అని అనగానే బాలకృష్ణ పెద్ద చక్రాన్ని ఒంటి చేత్తో పైకి లేపుతారు.

అప్పుడు శివుడు అవతారంలోనే కనిపిస్తారు.ఈ సన్నివేశం గూస్‌బంప్స్ తెప్పించింది.

ఇది సినిమా హిట్ కావడంలో కీలక పాత్ర పోషించింది.

Telugu Akhanda, Anji, Balayya, Boyapati Srinu, Chirenjeevi, Drdhanvanti, Karthik

• కార్తికేయ 2

మిస్టరీ యాక్షన్-అడ్వెంచర్ ఫిల్మ్ కార్తికేయ 2లో డాక్టర్ కార్తికేయ( Dr.Karthikeya ) (నిఖిల్) కృష్ణ భగవానుడి కడియాన్ని కనుగొనాలని తిరుగుతుంటాడు.ఆ ఆభరణం అన్వేషణలో ఉన్నప్పుడు కార్తికేయ డా.

ధన్వంతి వేద్పాఠక్ ( Dr.Dhanvanti Vedpathak )అనుపమ్ ఖేర్)ను మీట్ అవుతాడు.అప్పుడు అతను “కృష్ణుడు ఎక్కడ లేడు? ప్రతిచోట ఉన్నాడు” అని ఒక డైలాగ్ చెప్తాడు.ఆ డైలాగు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.

అది గూస్‌ బంప్స్ తెప్పిస్తుంది.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో పెద్ద హిట్ కావడానికి ఈ ఒక్క సన్నివేశమే కారణం అని చెబుతారు.

Telugu Akhanda, Anji, Balayya, Boyapati Srinu, Chirenjeevi, Drdhanvanti, Karthik

• అంజి

కోడి రామకృష్ణ( Kodi ramakrishna ) దర్శకత్వంలో వచ్చిన అంజి (2004) పెద్దగా ఆడలేదు కానీ బుల్లితెరపై బ్లాక్‌బస్టర్ అయింది.ఈ ఫాంటసీ యాక్షన్-అడ్వెంచర్ సినిమాలో గ్రాఫిక్స్ నెక్స్ట్ లెవెల్.అందుకే దీనికి నేషనల్ ఫిలిం అవార్డు వచ్చింది.త్రీడీ డిజిటల్ గ్రాఫిక్స్ వాడినందుకు మరికొన్ని అవార్డులు, అరుదైన గౌరవాలను కూడా దక్కించుకుంది.అయితే ఇందులో ఒక గూస్‌బంప్స్ తెప్పించే సీన్ ఉంటుంది.హిమాలయాలలోని ఆత్మలింగం అపారమైన దివ్య శక్తులను కలిగి ఉందని, ఆకాశగంగా 72 ఏళ్లకు ఒకసారి ఆ ఆత్మలింగంపై అభిషేకం లాగా పడుతుందని, ఆ నీటిని తాగితే ఎప్పటికీ మరణం రాదని, యవ్వనంగా ఉంటామని ఈ సినిమాలో చూపించారు.

అయితే విలన్ ఈ ఆత్మ లింగాన్ని చివరికి చేజిక్కించుకొని చిరంజీవితో పోరాడుతుంటాడు.ఆ సమయంలో శివుడు కనిపిస్తాడు.

ఒక్కసారి ఆ దృశ్యం చూస్తే జన్మలో మర్చిపోలేము.దాన్ని తలుచుకున్నప్పుడల్లా కళ్ళ ముందే శివుడు ఉన్నట్టుగా అనిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube