ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ అధికారికి వినతిపత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్న ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని నియమించాలని కోరుతూ జిల్లా షెడ్యూల్ అభివృద్ధి శాఖ అధికారి కి విద్యార్థి ,ప్రజా, దళిత సంఘాల ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం అందజేశారు .ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జిల్లా కేంద్రానికి ఎస్సీ స్టడీ సర్కిల్ రావడానికి గతంలో విద్యార్థి ,ప్రజా ,దళిత సంఘాల ఆధ్వర్యంలో చేసిన అనేక పోరాటాల ఫలితంగా ఈ స్టడీ సర్కిల్ ఏర్పడిందని అన్నారు.
ఈ ఏర్పాటు తర్వాత ఇందులో ఉన్నటువంటి డైరెక్టర్ అలాగే మిగతా పోస్టులను పారదర్శక పాటించక ఎస్సీ సామాజిక వర్గానికి కాకుండా ఇతర వర్గాలకు కేటాయిస్తున్నారని ఈ నియామకాలను విద్యార్థి, ప్రజా ,దళిత సంఘాలుగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.ఎందుకంటే దళిత బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఉద్యోగాలు సాధించే దిశగా వారిని మోటివేషన్ చేయడానికి, ప్రభుత్వం నుంచి వచ్చే ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవడానికి వారికి అర్థమయ్యేలా వాళ్లతో కలిసి పోయి వివరించేందుకు ఆ యొక్క సామాజిక వర్గానికి చెందిన డైరెక్టర్ అయితేనే వారి తో కలిసిపోయి పూర్తీ స్థాయిలో స్టడీ సర్కిల్ యొక్క ఉద్దేశాలను దాని వినియోగం గురించి చెప్పగలుగుతాడని , అదే ఇతర వర్గాలకు కేటాయిస్తే అవగాహన ప్రయత్నం విఫలమవుతుందని, దళితుల పిల్లల పరిస్థితులను అర్థం చేసుకోలేక పోతారని అన్నారు.
ఎస్సీ సామాజిక ,ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితుల పైన పూర్తి స్థాయిలో అవగాహన ఆ వర్గానికి చెందిన వారికి ఉంటది ,డైరెక్టర్ గా ఎస్సీ సామాజిక వర్గానికి కేటాయించాలని డిమాండ్ చేశారు.అలాగే మిగతా పోస్టులను కూడా పారదర్శకత పాటించి సరైన అర్హులను గుర్తించి నియమాకాలను చేపట్టాలని నియామకాల్లో అవకతవకలు లేకుండా చూడాలని అన్నారు.
ఇలా కాకుండా డైరెక్టర్ పోస్టులు ఇతర వర్గాలకు ఇస్తే రేపటి రోజున అన్ని విద్యార్థి ప్రజా సంఘాల దళిత సంఘాల ఆధ్వర్యంలో ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసి నిరుద్యోగులును అందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి నాగరాజు, భీమ్ ఆర్మీ జిల్లా అధ్యక్షులు దొబ్బల ప్రవీణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మల్లారం ప్రశాంత్, అంబేద్కర్ సంఘం నాయకులు మాసం సుమన్, మధు, అజయ్, విక్రం, రంజిత్ తదితరులు పాల్గొన్నారు
.