బాధిత కుటుంబాలను పరామర్శించిన ఉపసర్పంచ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రం లోని హై స్కూల్ ఏరియా లో గురువారం రాత్రి హై వోల్టేజ్ కారణం గా పలువురు ఇండ్లలో గల టి.వి లు, ఫ్యాన్లు, కూలర్ లు కాలిపోగా బాధిత కుటుంబాలను కలిసి ఈ రోజు ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

 Subsarpanch Visited The Affected Families , Subsarpanch, Rajitha Yadav-TeluguStop.com

హై స్కూల్ వద్ద గల ప్రమాధకరంగా ఉన్న విద్యుత్ ట్రాన్సపార్మర్ ను తొలగించాలని అక్కడి ప్రజలు ఆమె కు విన్నవించగా సెస్ అధికారుల దృష్టికీ తీసుకెళ్లుతానని ఆమె అన్నారు.ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమని ఆమె అన్నారు.

ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందించేలా సెస్ పాలకవర్గ సమావేశంలో తీర్మానించాలని కోరుతూ సెస్ ఎం.డి రామకృష్ణ ను కలిసి విన్నవిస్తామని ఆమె అన్నారు.ఆమె వెంట కె సి ఆర్ ఆత్మగౌరవ కాలనీ కమిటీ ప్రధాన కార్యదర్శి సుంకి భాస్కర్, బాధ రమేష్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube