పోలీసుల పెరు చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కేసు నమోదు

రాజన్న సిరిసిల్ల జిల్లా :పోలీసుల పెరు చెప్పి డబ్బులు వసూలు చేసిన ఘటనలో కేసు నమోదు.ఈ సందర్భంగా డీఎస్పీ నాగేంద్ర చారి( DSP Nagendra Chari ) మాట్లాడుతూ…తేదీ 12.01.2024 రోజున తంగల్లపల్లి పోలీస్ వారు ట్రాక్టర్ వే బిల్లు చూపించనందున మూడు ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కి తరలించగా , అదే అదునుగా చేసుకొని తంగళ్ళపల్లి కి చెందిన అక్కపల్లి ఎల్లారెడ్డి( Akkapalli Ellareddy ) అనే వ్యక్తి మూడు ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్ ఓనర్ అయిన సురా వెంకటరమణకు కాల్ చేసి తంగాలపల్లి పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతూన్న నేను ఎస్.ఐ తో మాట్లాడి మీ యెక్క ట్రాక్టర్ తీసుకవస్తా అని చెప్పి బెదిరించి బలవంతంగా 13,000=00 రూపాయలు తీసుకుని, తమ సొంతా ఖర్చులకు వాడుకున్నారు.మంగళవారం రోజున వెంకటరమణ ఇచ్చిన పిర్యాదు మేరకు ఎల్లారెడ్డిపై కేసు నమోదు చేసి అక్కపల్లి ఎల్లారెడ్డిని మంగళవారం రోజున సాయంత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగిందని,మరికొంత మందిపై విచారణ జరుగుతుందని డిఎస్పీ గారు తెలిపారు.

 A Case Has Been Registered In The Incident Of Extorting Money By Impersonating T-TeluguStop.com

ప్రజలకు విజ్ఞప్తి.

పోలీస్ ల పేరుతో కానీ,పోలీస్ వారికి మేము సన్నిహితులం అంటూ బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడే వారి పాట్ల అప్రమత్తంగా ఉంటూ అలాంటి సంఘటనలు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని డిఎస్పీ నాగేంద్రచారి కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube