బదిలీపై వెళ్తున్న పట్టణ సీఐ ఓ, వెంకటేష్ కు ఘన సత్కారం!

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లో శాంతి భద్రతలను కాపాడటంలో తనదైన ముద్ర వేసుకున్న పట్టణ సీఐ ఓ, వెంకటేష్( CI O, Venkatesh ) బదిలీపై వెళ్తుండడంతో నియోజకవర్గానికి చెందిన పలువురు యువకులు గజమాలలతో శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.పోలీస్ శాఖలో సిఐ వెంకటేష్ బాధ్యత యుతంగా ఎంతగానో కృషి చేశారని ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి అమూల్యమైన సేవలను వారు కొనియాడారు.

 City Cio, Venkatesh, Who Is Going On Transfer, Is Honored , Cio, Venkatesh, Vemu-TeluguStop.com

రాబోయే రోజుల్లో వేములవాడ( Vemulawada ) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆశీస్సులతో పోలీస్ శాఖలో మరిన్ని ఉన్నతమైన పదవులను చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆశించారు.అనంతరం బదిలీపై పట్టణానికి వచ్చినటువంటి నూతన సీఐ కరుణాకర్ కు స్వాగతం పలికి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ కార్యక్రమంలో దయ్యాల సుకుమార్, న్యాత నవీన్, జింక శ్రీధర్, చింతలపల్లి సంతోష్, యూసుఫ్, రిక్కీ, రమేష్, హేమంత్, మరియు 50 మంది యువకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube