వేములవాడ మున్సిపల్ కార్యాలయం లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు( Madhavi raju )రాజన్న సిరిసిల్ల జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు.అనంతరం బిఆర్ఎస్ పార్టీ( BRS party ) ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ లో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణలో పట్టణ,రూరల్ సెస్ కార్యాలయంలో జాతీయ పతాక ఆవిష్కరణలో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి రాజు.

 Telangana Formation Celebrations At Vemulawada Municipal Office, Telangana For-TeluguStop.com

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా వేములవాడ పట్టణ ప్రజలకు ఎమ్మెల్యే రమేష్ బాబు తరఫున మున్సిపల్ పాలకవర్గం తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ ప్రజల చిరకాల కోరిక నెరవేరునటువంటి రోజు ఈ రోజు అని ఎంతో మంది విద్యార్థి అమరవీరుల త్యాగాల ఫలితం ఈ తెలంగాణ రాష్ట్రమని సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉండేదని, సమైక్య రాష్ట్రంలో నోచుకోలేని అభివృద్ధి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా కేసీఆర్ అయిన తర్వాత సాగునీరు,తాగునీరు వైద్యరంగం,విద్యారంగంలో ఇంకా అనేక రంగాలలో అభివృద్ధి సాధించడం జరిగిందని అన్నారు.

సంక్షేమం అభివృద్ధి విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ముందు వరుసలో ఉందంటే అది కేవలం కేసీఆర్ పాలనకు( CK KCR ) నిదర్శనం అని మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ముఖ్యమంత్రి కెసిఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు.

వేములవాడ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమేష్ బాబు సారధ్యంలో ప్రజలకు ప్రతి ఇంటికి ఏదో రూపంలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయని వేములవాడ( Vemulawada ) పట్టణం, నియోజకవర్గం కోట్ల రూపాయలతో అభివృద్ధి చెందుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ కలలగన్నటువంటి బంగారు తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ భాగ్యస్వాములు అయి బంగారు తెలంగాణ సాధించుకోవాలని వారన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపుమేరకు ఈరోజు నుండి జూన్ 22 వరకు నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాల లో ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకొని విజయవంతం చేయాలని వారన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ ,సెస్ డైరెక్టర్లు నామాల ఉమా ,దేవరాజం , పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు,పట్టణ అధ్యక్షులు పుల్కం రాజు , రూరల్ అధ్యక్షులు గోస్కుల రవి, నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి,గడ్డం హన్మండ్లు,పొలాస నరేందర్,నాయకులు, అధికారులు,మున్సిపల్ సిబ్బంది,సెస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube