మాధకద్రవ్యాల నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలి - ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “డి-ఆడిక్షన్” సెంటర్ ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలసి ప్రారంభించిన ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్.మాధకద్రవ్యాలకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకుంటున్న వారిని సన్మార్గంలో నడిపించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రత్యేక చొరవతో జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లోని బస్తి దవాఖానలో ఆపరేషన్ విముక్తి పేరుతో*”డి-ఆడిక్షన్”* సెంటర్ కి శ్రీకారం చుట్టడం అభినందనీయమని ప్రభుత్వ విప్ కొనియాడారు.

 Everyone Should Share In Drug Control Govt Whip Adi Srinivas, Drug Control ,gov-TeluguStop.com

డి-ఆడిక్షన్ సెంటర్ యెక్క ప్రాముఖ్యత.

● ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు గంటల పాటు సైకాలజిస్ట్, సైక్రియాటిస్టులతో కౌన్సిలింగ్ నిర్వహించేలా ఏర్పాటు.
● మత్తు పదార్థాలకు బానిసలు అయిన వారు త్వరగా కోలుకునేలా అవసరమైన మెడిసిన్ ఉచితంగా అందించేలా ఏర్పాటు.
డి- ఆడిక్షన్ సెంటర్ లో కౌన్సిలింగ్ లో పాల్గొన్న మార్పు లేని వారిని హైద్రాబాద్ లోని ఆసుపత్రికి తరలించి పూర్తిగా కోరుకునే వరకు అవసరమైన వసతి సౌకర్యాలు,ఆసుపత్రి ఖర్చులు వేచించేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు.

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఏ.రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దేశ భవిష్యత్తును నిర్ణయించే యువత గంజాయి, మత్తుపదార్థాల బారిన పడకుండా రాష్టంలో పకడ్బందీ చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.మాధకద్రవ్యాల నిర్మూలన కోసం మరియే ఇతర రాష్ట్రాలలో లేని విధంగా ప్రభుత్వం ఎంతో సాహాసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతుందని, గంజాయి, డ్రగ్స్ మత్తు పదార్థాల నియంత్రణ అందరూ సామాజిక బాధ్యతగా భావించాలన్నారు.

మాదక ద్రవ్యాల ప్రభావంతో యువత మత్తుకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, యువత పురోగతికి అవరోధంగా నిలుస్తున్న గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలను నియంత్రించడం

ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతీ ఒక్కరు మాధకద్రవ్యాల నియంత్రణలో భాగస్వాములు కావాలని, మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించడానికి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలు అభినందనీయం అన్నారు.జిల్లాలో మత్తు పధార్థాల, గంజాయి నిర్ములనకు పోలీస్ శాఖకు మావంతు సహాయ సహకారాలు అందిస్తాం అన్నారు.

అనంతరం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.సత్ప్రవర్తన కలిగిన పౌరులే రేపటి భవిష్యత్తు కి పునాది అని అలాంటి పౌరులు మాధకద్రవ్యాలకు బానిసలు కాకుండా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందిన్నారు.

జిల్లాలో గంజాయి, మాధకద్రవ్యాల నిర్ములనకు ప్రత్యేక చర్యలు తీసుకోవడతో పాటుగా మాధకద్రవ్యాల వలన కలుగు అనార్ధాల గురించి జిల్లాలో యాంటీ డ్రగ్ క్లబ్స్ ఏర్పాటు చేసి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించాడాం జరుగుతున్నరు.మాధకద్రవ్యాలకు అలవాటు పడిన వారిని సన్మార్గంలో నడిపించేందుకు ,డి-అడిక్షన్ సెంటర్ ఏర్పటు చేసి సైకలజిస్ట్,సైకియాట్రిస్ట్ డాక్టర్స్ తో కౌన్సెలింగ్ తో పాటుగా వైద్య సదుపాయాలు అందజేయం జరుగుతున్నారు.

డి-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్ కొరకు పెరు నమోదు, ఇతర సమాచారం కోసం మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ సంప్రదించాలని అన్నారు.గంజాయి, మత్తు పదార్థాలు కి సంబంధించిన సమాచారం మెసేజ్ యువర్ ఎస్పీ వాట్సప్ నెంబర్ 6303 922 572 కి సమాచారం అందించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ ఉదయ్ రెడ్డి,ఇంచార్జ్ డి ఎమ్ ఎచ్ ఓ రజిత, చికోటి సంతోష్ (సూపరింటెండెంట్ ప్రభుత్వ ఆసుపత్రి సిరిసిల్ల, సైక్రియాటిస్టులు డా.ప్రవీణ్ కుమార్ , డా.సతీష్,కౌన్సిలర్ పూర్ణచందర్ సి.ఐ రఘుపతి, సిబ్బంది పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube