ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ( Hemant Soren )పిటిషన్ పై ఆ రాష్ట్ర హైకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ హేమంత్ సోరెన్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈనెల 9వ తేదీలోగా సమాధానం ఇవ్వాలని ఈడీకి ఝార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.అనంతరం తదుపరి విచారణను ఈనెల 12వ తేదీకి వాయిదా వేసింది.
అయితే భూ కుంభకోణం మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్ ను ఈడీ( Ed ) అధికారులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈడీ సమన్లను వ్యతిరేకిస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.తన వాదనను హైకోర్టులోనే వినిపించాలని సూచించింది.దీంతో ఆయన ఝార్ఖండ్ లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.కేవలం రాజకీయ కారణాలతోనే తనను వేధిస్తున్నారని, అరెస్ట్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.