రాజన్న సిరిసిల్ల జిల్లా :భారత కమ్యూనిస్టు పార్టీ సిరిసిల్ల పట్టణ సీనియర్ నాయకులు బూర శ్రీనివాస్ గురువారం తెల్లవారుజామున పద్మా నగర్ లోని తన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.గత కొంతకాలంగా శ్రీనివాస్ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
శ్రీనివాస్ సుదీర్ఘకాలం శ్రామిక శక్తి బీడి వర్కర్స్ నాయకులుగా పనిచేశారు.బీడీ కార్మికుల వేతనాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం జరిగిన అనేక పోరాటాలు ముందు వరుసలో ఉన్నారు.
శ్రామిక శక్తి బీడీ వర్కర్స్ నాయకులుగా పనిచేస్తున్న కాలంలో తీవ్రనిబంధాన్ని సైతం ఎదుర్కొన్నారు.అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లో చేరిన ఆయన కార్మికుల సమస్యలపై జరిగిన ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు.
సిపిఐ నాయకులు పంతం రవితోపాటు పలువురు నాయకులు బుర్ర శ్రీనివాస్ మృతదేహానికి ఎర్రజెండా కప్పి నివాళులు అర్పించారు.ఆయన మృతి కార్మిక ఉద్యమాలకు తీరని లోటని అన్నారు.
ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక నాయకులు, శ్రామిక శక్తి వీడి వర్కర్స్ నాయకురాలు రాజేశ్వరి శ్రీనివాస్ కు నివాళులు అర్పించారు
.