డ్రాగన్ ఫ్రూట్ సాగుచేస్తున్న రత్నంపేట గ్రామ యువరైతు కౌడగాని సత్యంకు కలెక్టర్ అభినందన

క్షేత్రసందర్శనకు రైతులను తీసుకెళ్లాలని జిల్లా ఉద్యానవన అధికారికి ఆదేశంరాజన్న సిరిసిల్ల జిల్లా: సంప్రదాయ పంటల స్థానంలో లాభదాయక పంట డ్రాగన్ ఫ్రూట్( Dragon Fruit ) సాగుచేస్తూ ఇతర రైతులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న ప్రోగ్రెసివ్ యువ రైతు కౌడగాని సత్యంను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anurag Jayanti ) అభినందించారు.ఫెంటాస్టిక్ జాబ్… గో హెడ్ అంటూ వెన్నుతట్టారు.

 Collector Congratulates Kaudagani Satyam, A Young Lady Of Ratnampet Village Who-TeluguStop.com

శనివారం బోయినిపల్లి మండలం రత్నం పేట గ్రామానికి కౌడగాని సత్యం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అదనపు కలెక్టర్ ఎన్ ఖీమ్యా నాయక్ లను సమీకృత జిల్లా కార్యాలయాయంలో కలిశారు.

తమ వ్యవసాయ క్షేత్రంలో పండించిన డ్రాగన్ ఫ్రూట్ లను బహూకరించారు.

ఇదే పంట వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది?డ్రాగన్ ఫ్రూట్ పంట సాగు, మార్కెటింగ్ తదితర అంశాల గురించి జిల్లా కలెక్టర్ రైతు సత్యం( Kaudagani Satyam ) అని అడిగి తెలుసుకున్నారు.సాంప్రదాయక పంటల స్థానంలో వాణిజ్య పంటలను సాగుచేస్తే సాగును లాభదాయకం చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతోవరిసాగు స్థానంలో 2021 లో డిసెంబర్ లో డ్రాగన్ ఫ్రూట్ ను సాగు చేశానని సత్యం జిల్లా కలెక్టర్ కు చెప్పారు.

పంట ప్రారంభం నుంచి మొదటి పంట చేతికి వచ్చే వరకూ పెట్టుబడి 8 ఎకరాలకు 70 లక్షలు ఖర్చు అయ్యిందన్నారు.ప్రభుత్వ సహాయం హెక్టార్ సాగుకు లక్ష 30 వేల చొప్పున 2 హెక్టర్ లకు 2 లక్షల 60 వేల రూపాయలు అందాయన్నారు.

పంట సాగు చేసిన ఏడాదికి శాంపిల్ ఫ్రూట్ వచ్చింది.ఈ ఏడాది నుంచి కమర్షియల్ గా విక్రయిస్తున్ననీ జిల్లా కలెక్టర్ తెలిపారు .హైదరాబాద్ కరీంనగర్ జగిత్యాల గోదావరిఖని పట్టణాలకు ఫ్రూట్లు విక్రయిస్తున్నాననీ అన్నారు మొదట్లో కొన్ని బాలారిష్టాలు ఎదురైన ఇప్పుడు దిగుబడి బాగుందన్నారు.మూడు సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి పూర్తి మొత్తం తిరిగి వస్తుందని ఆ తర్వాత నుంచి 20 సంవత్సరాల పాటు లాభాలు వస్తాయని చెప్పారు.

ప్రస్తుతం మార్కెట్లో కిలోపండ్ల ధర 100 నుంచి 170 వరకు హోల్ సేల్ గా తోట వద్ద విక్రయిస్తున్నట్లు తెలిపారు.డిమాండ్ కూడా బాగుందని చెప్పారు.సాగులో మెలికలు పాటిస్తే ఆశించిన దిగుబడి తో పాటు దీర్ఘకాలం సుస్థిర ఆదాయం రైతులు సొంతం చేసుకోవచ్చని తెలిపారు.శభాష్ అంటూ రైతు సత్యమును అభినందించిన జిల్లా కలెక్టర్… మిగతా రైతులకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారని చెప్పారు రానున్న రోజుల్లో కూడా మరింత మందిని సంప్రదాయ పంటల స్థానంలో వాణిజ్య లాభదాయక పంటల వైపు తమ అనుభవాలను చెప్పి ప్రోత్సహించాలని తెలిపారు.

జిల్లాలోని ఔత్సాహిక రైతులతో కలిసి ఉద్యానవన అధికారులుబోయినిపల్లి మండలం( Boinapally ) రత్నం పేట గ్రామానికి తీసుకెళ్లి డ్రాగన్ ఫ్రూట్ పంటను సందర్శించాలన్నారు.రైతు సత్యం అనుభవాలను మిగతా రైతులకు తెలియజేయాలన్నారు.

సాధ్యమైనంత మంది ఎక్కువ రైతులు సంప్రదాయ పంటల స్థానంలో సాగు చేసేలా చైతన్యం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన అధికారి జ్యోతి, జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube