ఈవీఎంల కమిషనింగ్‌ పకడ్బందీగా చేపట్టాలి - జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్న సిరిసిల్ల జిల్లా : ఈ నెల 13 న జరుగనున్న పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కోసం ఈవీఎంల కమిషనింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు.శనివారం వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేపడుతున్న ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

 Commissioning Of Evms Should Be Done With Full Force District Collector Anurag J-TeluguStop.com

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు కమిషనింగ్‌ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు.ఈవీఎంలపై సీరియల్‌ నెంబర్లు, అభ్యర్థుల పేర్లు, వారికి కేటాయించిన చిహ్నాల ఏర్పాటు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు.

కమిషనింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్‌ పోలింగ్‌ నిర్వహించి, ఈవీఎంల పనితీరు పరిశీలించాలన్నారు.అలాగే స్ట్రాంగ్‌రూమ్‌ నిర్వహణ వివరాలను ఏఆర్‌ఓలను అడిగి తెలుసుకున్నారు.

ఫెసిలిటేషన్ కేంద్రాల సందర్శన

సిరిసిల్ల లోని గీతా నగర్ పాఠశాలలో, వేములవాడ లోని నూతన గ్రంథాలయ భవనంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు.పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరిగేందుకు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకున్న ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్నారు.కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్, సిరిసిల్ల ఏఆర్ఓ పి.గౌతమి, వేములవాడ ఏఆర్ఓ రాజేశ్వర్, సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, పోస్టల్ బ్యాలెట్ నోడల్ అధికారి లక్ష్మీరాజం, తహసీల్దార్లు షరీఫ్ మోహినొద్ధీన్, మహేశ్ కుమార్, తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube