ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలి:జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్,

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నమోదు అవుతున్నా కేసులలో అధికారులు పకడ్బదీగా పారదర్శకంగా విచారణ చేపట్టి కోర్టులలో నెరస్తులకు శిక్షలు పడే విధంగా ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ గురువారం రోజున జిల్లా పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.

 District Sp Akhil Mahajan Should Conduct Quality Investigation In Every Case And-TeluguStop.com

పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశోధన చేసి ఫైనల్ చేసి కోర్టు లలో నిందుతులకు శిక్షలు విధముగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని అన్నారు.ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసి కేసుల్లో శిక్షల శాతం పెంచాలన్నారు.

జిల్లాలో హిస్టరీ, రౌడీ షీటర్స్ పై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠినంగా వ్యహరించాలన్నారు.గ్రామాల్లో, పట్టణాలలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై నిఘా ఏర్పాటు చేసి వారిని సంబంధిత అధికారుల ముందు బైండోవర్ చేయాలన్నారు.

నేర నియంత్రణలో విలేజ్ పోలీస్ అధికారి కీలక పాత్ర అని జిల్లాలో గ్రామ స్థాయిలో విలేజ్ పోలీస్ అధికారి వ్యవస్థ బలోపేతం చేసి గ్రామ స్థాయిలో ఇన్ఫర్మేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోలని తద్వారా శాంతి భద్రతల పర్యవేక్షణ సులబతరం అవుతుందన్నారు.

నేర పరిశోధనలో సీసీ కెమెరాల ప్రాముఖ్యత ను ప్రజలకు అవగాహన కల్పిస్తూ సీసీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేయాలన్నారు.

గ్రామాల్లో, మండల కేంద్రాల్లో,పట్టణ కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండ ఫ్లెక్సీస్ ఏర్పటు చేసే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని,పండగలు,వివిధ జాతర సమయాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రత చర్యలు తీసుకోవాలన్నారు.రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీ.జే ల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ నిబంధనలకు విరుద్ధంగా డి.జే ఉపయోగించినట్లు అయితే కేసులు నమోదు చేసి డి.జే లు సీజ్ చేయాలని ఆదేశించారు.వివిధ కారణాలతో రోడ్ల మీదకు వచ్చి రాస్తా రొక,దార్నా ల పేరుతో ప్రజా రవాణాకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు.

జిల్లాలో అక్రమ గంజాయి రవాణా,గుడుంబా,అక్రమ ఇసుక రవాణా, పిడిఎస్ రైస్ లపై ఉక్కుపాదం మోపాలన్నారు.ప్రతి పోలీస్ స్టేషన్ లో స్పెషల్ డ్రైవ్ లు ఏర్పాటు చేసి మైనర్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా,నెంబర్ ప్లేట్ లేకుండా,మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడిపే వారిపై,డ్రంక్ అండ్ డ్రైవ్,ఓపెన్ డ్రింకింగ్ లపై, నిబంధనలకు విరుద్ధంగా సైరైన్ ఉపయోగించే వాహనాలపై దృష్టి సారించాలన్నారు.

ఈ సమావేశంలో ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు చంద్రశేఖర్ రెడ్డి, మురళి కృష్ణ ,సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, ఐటీ కోర్ సిబ్బంది, పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube