పేదింటి ఆడపడుచు వివాహానికి పుస్తే మెట్టెలు అందజేత

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన శనిగరపు మౌనిక వివాహం బండలింగంపల్లి కి చెందిన కొడిముంజ బాబు తో సోమవారం బండలింగంపల్లి లో జరుగగా ఆమె వివాహానికి నేవూరి కీ.శే.

 Toe Rings Mettelu Offered To Poor Bride In Rajanna Sircilla District, Toe Rings,-TeluguStop.com

నేవూరి మల్లారెడ్డి లక్ష్మి గార్ల జ్ఞాపకార్థం ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి మౌనిక కు పుస్తే మెట్టెలు అందజేశారు.

నేటితో పుస్తే మెట్టెలు అందజేసిన సంఖ్య 1006 కి చేరుకుంది.

మౌనిక తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోగా ఆమెను ఆమె మేనమామ విశ్వనాథం పెంచి పోషించినారు.నేవూరి వెంకట్ రెడ్డి ఇచ్చిన పుస్తే మెట్టెలను ఎడ్ల సందీప్,బాబు,సల్మాన్ అందజేశారు.

ఈ సందర్భంగా యువతి మేన మామ, ఆమె బందువులు, గ్రామస్తులు సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube