సూర్యాపేట జిల్లా: 16 ఏండ్ల కాలంలో 34 సార్లు అత్యవసర సమయంలో రక్తదానం చేసి ఎన్నో ప్రాణాలను నిలిపిన సూర్యాపేటకు చెందిన హెడ్ కానిస్టేబుల్ పాలెల్లి రమేష్ ఎంతో మందికి ఆదర్శంగా మారారు.ఏ పాజిటివ్ రక్తం కావాల్సిన వారికి అందుబాటులో ఉంటూ,అత్యవసర సమయాల్లో రక్తదానం చేస్తూ తనవంతు సమాజ సేవ చేస్తున్నారు.
కరోనా సమయంలో ఒకే ఏడాదిలో నాలుగుసార్లు రక్తదానం చేయగా,రక్త కొరత లేకుండా సోషల్ మీడియాలో అన్ని రకాల గ్రూపులకు చెందిన వివిధ వర్గాలకు చెందిన వారితో గ్రూపు ఏర్పాటు చేసి రక్తదానం చేసేందుకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అదే విధంగా ప్రతి సంవత్సరం అనాథ పిల్లలకు ఉచిత నోట్ బుక్స్ అందిస్తున్నారు.
అంతేకాకుండా ఇంటింటికి తిరిగి పాత బట్టలను సేకరించి అనాథ ఆశ్రమంలో ఉన్నవారికి అందించి,తన దాతృత్వాన్ని చాటుకుంటున్నాడు.ఖాళీ సమయాల్లో వంట చేస్తూ వచ్చిన ఆదాయంతో చదువుకోలేని పేద పిల్లలను చదివిస్తూ సేవ గుణాన్ని పది మందికి పంచుతున్నారు.
అవయవ దానంపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చేలా తనవంతు కృషి చేస్తున్నారు.హైదరాబాద్ కు చెందిన జీవన్ ధర్ సంస్థకు తన మరణాంతరం అవయవాలను డొనేట్ చేసేందుకు అగ్రిమెంట్ సైతం చేశారు.
వృత్తి పోలీస్ అయినా ప్రవృత్తి సమాజ సేవకే అంకితమైన ఈ పోలీస్ నిజమైన ఫ్రెండ్లీ పోలీస్ కు అసలైన నిర్వచనం చెబుతున్నారు.హెడ్ కానిస్టేబుల్ రమేష్ ది నిజంగా గ్రేట్ జాబ్ కదా అని పలువురు అభినందనలు తెలుపుతున్నారు.