యాదాద్రి భువనగిరి జిల్లా:బీఆర్ఎస్ పార్టీ అన్నా,ఆ పార్టీ నాయకులన్నా,ముఖ్యంగా కేసీఆర్ ఫ్యామిలీ అన్నా ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం అందరినీ ఆశ్చర్యపరిచేలా కేటీఆర్ తో భేటి అయ్యారు.ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ నేతలతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,మాజీ మంత్రి హరీశ్ రావును కలిసి మెమొరాండం అందించారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు.కేటీఆర్ ను తీన్మార్ మల్లన్న కలవడంపై సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు ఊపందుకున్నాయి.