సూర్యాపేట జిల్లా:మేళ్లచెరువు మండల కేంద్రంలో సోమవారం పల్సర్ బైక్ అదుపుతప్పి మై హోమ్ సిమెంట్ లోడ్ తో కోదాడ వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టిన ఘటనలో బైక్ పై వెళుతున్న హుజూర్ నగర్ మండలం వేపలసింగారం గ్రామానికి చెందిన పోస్టల్ ఉద్యోగి పెద్దవరపు అంజి (26) అక్కడికక్కడే మృతి చెందాడు.మృతినికి ఆరు నెలల క్రితమే వివాహం జరిగిందని సమాచారం.
సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.