తెలంగాణ సాయుధ పోరాట యోధుడు బద్దం ఎల్లారెడ్డి స్థూపానికి నివాళులర్పించిన సిపిఎం నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా మంగళవారం గాలిపెల్లిలో గల బద్దం ఎల్లారెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముశం రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించి బడుగు బలహీన వర్గాల పక్షాన భూమి కొరకు భుక్తి కొరకు తెలంగాణ విముక్తి కొరకు నిజాం నిరంకుశ పాలనలో రజాకార్ల దొరల భూస్వాముల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా భాంచంన్ దోర.

 Cpm Leaders Pays Tributes To Telangana Sayudha Porata Veerudu Baddam Ellareddy,-TeluguStop.com

కాల్ముక్త.అన్న వారితో బరిసెలు పట్టించి దొరలను రజాకాలను తరిమి కొట్టించిన మహా నాయకుడు బద్దం ఎల్లారెడ్డి వారు చేసిన పోరాట ఫలితంగానే

ఈ రోజున ప్రజలు ఆత్మగౌరవంతో తెలంగాణ నైజాం ప్రభుత్వాన్ని విముక్తి భారతదేశంలో విలీనం కావడానికి చారిత్ముక పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అలాంటి మహత్తర పోరాటాన్ని బిజెపి , టిఆర్ఎస్ పార్టీలకు గాని ఎలాంటి సంబంధం లేదని,తెలంగాణ సాయుధ పోరాటాన్ని బిజెపి వక్రీకరిస్తూ హిందూ ముస్లిం పోరాటంగా మార్చి మతం పేరుతో రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నది ఇలాంటి కుటిల రాజకీయాలను ప్రజలు వ్యతిరేకించాలని అన్నారు.

బద్దం ఎల్లారెడ్డి స్ఫూర్తితో నేటి యువత ప్రయత్నించాలని ఆయన ఆశయాలను కొనసాగించాలని నైజాం ప్రభుత్వం హాయంలో దొరలు

ఏ విధంగా ప్రజలను అణిచివేయాలని చూశారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి హక్కులు లేకుండా అణిచివేయాలని చూస్తుందని, పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వ ఆయాంలో కూడు గూడు కొరకు రోడ్లెక్కే పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వం పేదలకు గుంట అంత జాగా ఇవ్వకుండా ప్రభుత్వ స్థలాలను మొత్తం అమ్ముకోవడం జరుగుతుందని భూమి కొరకు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో పేదలు ఇళ్ల స్థలాల కొరకు కనీస వేతనాల కొరకు పర్మినెంట్ ఉద్యోగుల కొరకు పోరాటానికి సిద్ధం కావాలని అన్నారు.బద్దం ఎల్లారెడ్డి కాశ్య విగ్రహాన్ని సిరిసిల్ల బివై నగర్ లో పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ముశం రమేష్ , సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గన్నారం నర్సయ్య , సిపిఎం జిల్లా నాయకులు ఎలిగేటి రాజశేఖర్, బైండ్ల రాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మందా అనిల్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు సాయి, ఆదిత్య , రాకేష్ ,రవి తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube