బుగ్గ రాజేశ్వర తండాలో గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు, బతుకమ్మ చీరల పంపిణీ..

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని బుగ్గరాజేశ్వర తండా గ్రామంలో గృహలక్ష్మి ఇండ్ల పట్టా, బతుకమ్మ చీరలను సర్పంచ్ అజ్మీర రజిత తిరుపతి నాయక్ చేతుల మీదుగా శుక్రవారం పంపిణీ చేశారు.ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఐటీ శాఖ మంత్రి కేటిఆర్ కి రుణపడి ఉంటామని అన్నారు.

 Gruhalakshmi Scheme Houses Bathukamma Sarees Distribution At Bugga Rajeshwari Th-TeluguStop.com

గ్రామంలో గుడిసెలు ఉన్నటువంటి వాటికి గృహలక్ష్మి పథకం కింద ఇండ్లు అందించడం చాలా ఆనందంగా ఉందని సర్పంచ్ అన్నారు.భూక్య రాజేష్ కి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 55 వేల రూపాయల చెక్కు మంజూరు కాగా అట్టి చెక్కును అందించడం జరిగిందన్నారు.

ఇది పేదల ప్రభుత్వం అని కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే తండాలకు మంచి రోజులు వచ్చాయని అన్నారు.

ఈ సందర్భంగా గృహలక్ష్మి ఇండ్ల పట్టాలు అందుకున్న వారు 20 సంవత్సరాలు గుడిసెలో ఉన్నామని ఈరోజు కెసిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత స్థలం ఉన్న వారికి మూడు లక్షల రూపాయల ప్రొసీడింగ్ అందుకున్నామని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ప్రతి ఇంటికి కెసిఆర్ పథకం అందుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ తండాలను గ్రామపంచాయతీ చేసిన తర్వాత అన్ని అభివృద్ధిలు జరుగుతున్నాయని జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ అజ్మీర తిరుపతి నాయక్ అన్నారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ సిరియా, వార్డు సభ్యులు భానోత్ రెడ్డి, కడవత రవి, బాదావత్ మోతిలాల్,ధరావత్ రంబాలి, నానావత్ పద్మ, గ్రామ శాఖ రవి, ఫీల్డ్ అసిస్టెంట్ గణేష్, దేవేందర్,గ్రామస్తులు పద్మ, కమల,రంబాలి, మమత,జ్యోతి, సన్ త్రి హే మాజీ హిరామన్,లక్ష్మి మాలి, రమేష్,రవి,రాజేందర్,బాలు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube