ముఖం అందంగా ఆకర్షణీయంగా మెరిసిపోవాలని దాదాపు అందరూ కోరుకుంటారు.ఈ క్రమంలోనే చాలా మంది మగువలు నెలకు ఒకటి లేదా రెండుసార్లు ఫేషియల్ చేయించుకుంటూ ఉంటారు.
ఖరీదైన క్రీమ్, సీరం తదితర ఉత్పత్తులను కొనుగోలు చేసి వాడుతుంటారు.వేలకు వేలు ఖర్చు పెడుతుంటారు.
కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ ఇంటి చిట్కాను పాటిస్తే ఎలాంటి ఖర్చు లేకుండా సులభంగా ఫేషియల్ గ్లోను తమ సొంతం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ సింపుల్ చిట్కా ఏంటో తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు శనగపప్పు, ఒక కప్పు బాగా ఎండిన ఆరెంజ్ పండు తొక్కలు( Orange Peel ), అర కప్పు ఎండిన గులాబీ రేకులు, అంగుళం ములేటి చెక్క వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న పొడి నుంచి మెత్తని పౌడర్ ను జల్లించి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలి.</br
ఇప్పుడు ఒక బౌల్‌లో తయారు చేసి పెట్టుకున్న పౌడర్ ను రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ తేనె( Honey ), రెండు లేదా మూడు టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలు( Milk ) వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై చర్మాన్ని వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.ఈ సింపుల్ హోమ్ రెమెడీని వారానికి జస్ట్ రెండు సార్లు కనుక వాడితే మీ చర్మం అందంగా కాంతివంతంగా మెరిసిపోతుంది.
ఫేషియల్ వల్ల ఎంతటి గ్లో వస్తుందో ఈ రెమెడీ వల్ల కూడా అంతే గ్లో పొందుతారు.పైగా ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే చర్మంపై మొండి మచ్చలు దూరం అవుతాయి.
మొటిమలు తరచూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి.చర్మ ఛాయ పెరుగుతుంది.
మరియు స్కిన్ స్మూత్ అండ్ షైనీ గా సైతం మారుతుంది.