రాజన్న సిరిసిల్ల జిల్లా : ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎదిగి ‘సక్సెస్’ శిఖరానికి చేరడానికి నిచ్చెన మెట్లుగా మన సద్గుణ సంపదలు దోహదపడతాయని విశ్రాంత ప్రిన్సిపాల్, కవి, పాఠ్య పుస్తక రచయిత, కాలమిస్ట్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి అన్నారు.వేములవాడ అర్బన్ మండలంలోని జెడ్.
పి.హెచ్.ఎస్.ఉన్నత పాఠశాల, చిర్లవంచ లో గోల్డెన్ శాతవాహన లయన్స్ క్లబ్ సౌజన్యంతో నిర్వహించిన పరీక్షల అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గుర్రం మధుసూధనరెడ్డి హాజరై మాట్లాడుతూ మన ఉన్నత వ్యక్తిత్వమే మన ఎదుగుదలకు ఇంధనంగా వినియోగపడుతూ అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగపడతాయని అన్నారు.
జీవితంలో స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించుకుని ఆ దిశగా కృషి చేసిన వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయని అన్నారు.
చెడు అలవాట్లు మన భవిష్యత్తును నాశనం చేస్తాయని, మంచి అలవాట్లతో ఉత్తమ వ్యక్తులుగా గుర్తింపు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.
ఎదగడానికి పేదరికం అడ్డుకాదని, పేదలకే ఎదగాలనే కసి ఉంటుందని, ఆ కసిని కృషిగా మార్చుకొని ఆదర్శంగా నిలవాలని కోరారు.పుస్తక పఠనాన్ని మంచి అలవాటుగా జీవితాంతం కొనసాగించిన వారు మేధావిగా గౌరవించబడతారని గుర్తు చేశారు.
పాఠశాల హెచ్‌ఎం మల్లేశం అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో లయన్స్ క్లబ్ అఫ్, కరీంనగర్ గోల్డెన్ శాతవాహన అధ్యక్షులు మనువాడ శంకర్, ఏ.వి.ఎస్.రాజులు మాట్లాడుతూ విద్యార్థులకు దిశ నిర్దేశనం చేశారు.
రానున్న పరీక్షల్లో ఆత్మవిశ్వాసంతో పాల్గొని ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులకు సన్మానం, విద్యార్థులకు బహుమతులు అందజేస్తామని ప్రకటించారు.ఈ సందర్భంగా తన రాసిన పుస్తకాలను పాఠశాల ప్రిన్సిపాల్, సభాధ్యక్షుడు మల్లేశం చేతుల మీదుగా గ్రంథాలయానికి అందజేశారు.
ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.