రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేట అంగడి బజారు లోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం లో స్వామి వారి వార్షికోత్సవ పూజ అర్చకుడు గొంగళ్ళ ఉమాశంకర్, శివా చార్య నెత్రు త్వంలో ఘనంగా నిర్వహించారు.మొదటగా గణపతి పూజ.
అష్ట దిక్పలక పూజ.గౌరీపూజా.పుణ్య వచనము.స్వామి వారికి మన్యు సూక్త సహిత అభిషేకం.
సింధూర పూజ.మంగళ హారతి.ఆశీర్వచనం.జరిపించారు.అనంతరం పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదం అందజేశారు.ఈ కార్యక్రమంలో గంప నాగేంద్రము పద్మ , బొందుగుల మార్కండేయ, నవ్వోతు రాము, వనం రమేశ్, సిద్ధిరములు, పారిపల్లి రాంరెడ్డి, రేవూరి లక్ష్మి నారాయణ, చెన్న సత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు.







