పటిష్టమైన ప్రణాళికతో రానున్న పార్లమెంట్ ఎన్నికల నిర్వహణ..

రాజన్న సిరిసిల్ల జిల్లా: పార్లమెంట్ ఎన్నికల ( Parliament Elections)నేపథ్యంలో జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు జిల్లా పోలీసు సిబ్బందికి సహాయంగా వచ్చిన సి ఐ ఎస్ ఎఫ్ కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలతో ఎన్నికల సమయoలో నిర్వహించాల్సిన విధులపై సిరిసిల్ల పట్టణ పరిధిలోని అంబేద్కర్ భవనంలో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ …రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు( Parliament elections) సంబంధించిన అన్ని విధుల్లో కేంద్ర బలగాలు జిల్లా పోలీసులతో కలిసి ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తరువాత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నియంత్రించడమే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందన్నారు.

 Management Of The Coming Parliament Elections With A Strong Plan ,parliament El-TeluguStop.com

కేంద్రం సాయుధ బలగాలును క్రిటికల్ పోలింగ్ స్టేషన్ లలో, రూట్ బందోబస్త్, కీలకమైన పాయింట్‌ల వద్ద సెంట్రల్ ఫోర్స్( Central Force ) సిబ్బందిని ఉంచడం జరుగుతుందన్నారు.జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ ల దగ్గర పటిష్ట నిగా ఏర్పాటు చేసి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

లోకల్ పోలీస్( Local Police ) అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి గొడవ లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రతి అధికారి కృషి చేసి ఎన్నికల విజయవంతం చేయాలని,సమస్యాత్మక గ్రామాలపై,ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి ఫ్లాగ్ మార్చ్, రూట్ మార్చ్ నిర్వహిస్తూ ప్రజలకు భద్రత భావాన్ని కలిగించాలని అన్నారు.ఎన్నికల పరంగా, సదుపాయాల పరంగా ఎలాంటి సమస్యలు ఉన్న అధికారులకు తెలియజేయాలని సూచించారు.

అనంతరం ఎస్పి గారు జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్ వివరాలు,చెక్ పోస్ట్ లు, జిల్లా యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి సి ఐ ఎస్ ఎఫ్ అధికారులకు ఎస్పీ గారు వివరించారు.ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రాచారి, సి.ఐ సధన్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ సి.ఐ అనిల్ కుమార్ , సిఐఎస్ఎఫ్ అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube