చిత్తూరు జిల్లా పలమనేరులో టీడీపీ అధినేత చంద్రబాబు( TDP Leader Chandrababu ) ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది.ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు దివంగత నేత ఎన్టీఆర్( Senior NTR ) శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.టీడీపీ ప్రభుత్వ హయాంలో సుమారు 24 ప్రాజెక్టులను పూర్తి చేశామన్నారు.
ఈ క్రమంలోనే దాదాపు 34 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.కానీ వైసీపీ ( YCP )అధికారంలోకి వచ్చిన తరువాత రాయలసీమను ఎడారిగా మార్చిందని ఆరోపించారు.
వైసీపీ సర్కార్ చెరువులకు నీరు అందించలేకపోతోందన్న చంద్రబాబు ప్రతీ ఎకరాకు సాగునీరు అందించడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు.