అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పదిర వెంకటాపూర్ గ్రామాల్లో బుధవారం ప్రారంభించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో గురువారం తెల్లవారుజామున కురిసిన భారీ అకాల వర్షానికి తడిసిపోయిన ధాన్యాన్ని బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్ బాయి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గురువారం ఉదయం పరిశీలించారు.అకాల వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్ద య్యాయి .

 Congress Party Leaders Inspecting The Grain Soaked By Untimely Rain , Saddi Laks-TeluguStop.com

వడ్లు కొన్ని చోట్ల కొట్టుకపోయి రైతులు నష్టపోయారన్నారు వెంటనే తూకాలు వేసి కొనుగోళ్లు చేపట్టాలని వెంటనే వరి ధాన్యాన్ని రైసు మిల్లులకు తరలించాలని రైతులు వారికి మొరపెట్టుకున్నారు.వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ షేక్ సబేరా బేగం గౌస్ బాయి బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోమ్మాటి నరసయ్య లు చెరవాణిలో అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ , డి ఎస్ ఓ , సివిల్ సప్లై డిఎం లతో మాట్లాడారు తడిసిపోయిన వరి ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లలకు తరలించాలని రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు.

వెంటనే స్పందించిన అధికారులు రైసు మిల్లర్లతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా మాట్లడుతామన్నారు.తడిచిన ధాన్యాన్ని మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గుండాడి రామ్ రెడ్డి , మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి, ఎఎంసి డైరెక్టర్లు గుళ్లపెల్లి లక్ష్మారెడ్డి , మెండే శ్రీనివాస్ యాదవ్ ,పొన్నాల తిరుపతిరెడ్డి ,గంట లక్ష్మీ బుచ్చ గౌడ్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు బండారి బాల్ రెడ్డి , కంచర్ల రాజు,చెరుకు ఎల్లయ్య యాదవ్ ,గుళ్ళపెల్లి శ్రీకాంత్ రెడ్డి, మూర్తి వెంకట్ రెడ్డి, ఉప్పుల నాగరాజు, కుంబాల వెంకట్ రెడ్డి, ఎదునూరు బాలరాజు, గుల్లపెల్లి రాజిరెడ్డి, కంబాల సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube